మంచు లక్ష్మీ ప్రసన్న భవిష్యత్ తేలేది రేపే
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తొలిసారిగా నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేస్తున్న చిత్రం 'ఝుమ్మంది నాదం'. ఈ చిత్రం రేపు (జూలై 1) రిలీజవుతోంది. ఆమె సోదరుడు మంచు మనోజ్ హీరోగా, తాప్సీని హీరోయిన్ గా పరిచయం చేస్తూ సీనియర్ దర్సకుడు రాఘవేంద్రరావు దర్సకత్వంలో ఆమె ఈ చిత్రం రూపొందించింది. ఈ చిత్రాన్ని డా. మోహన్ బాబు సమర్పిస్తున్నారు. మోహన్ బాబు ఓ కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ చిత్రం హిట్టయితే ఆమె నిర్మాతగా కొనసాగుతుందని, లేదంటే నటిగా ముందుకెళ్తుందని అంతటా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ఆమె రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాశరావు దర్సకత్వంలో ఓ సోషియా ఫాంటసీ చిత్రంలో విలన్ గా చేస్తోంది. ఈ నేపధ్యంలో 'ఝుమ్మంది నాదం' హిట్టై ఆమె మరిన్ని చిత్రాలు నిర్మించాలని అంతా కోరుకుంటున్నారు.
లక్ష్మీ ప్రసన్న ఝుమ్మంది నాదం తాప్సీ మంచు మనోజ్ మోహన్ బాబు రాఘవేంద్రరావు laxmi prasanna jhummandi naadam tapsi manoj kumar mohan babu raghavendra rao


Click it and Unblock the Notifications