రాఘవేంద్రరావులో రసికత తగ్గిందా లేక...
సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఝుమ్మంది నాదం చిత్రం జూలై 1న రిలీజు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. ఈ విషయం విన్నవారు రాఘవేంద్రరావు గత చిత్రాల్లో చూపించే శృగార సన్నివేశాలు ఈ చిత్రంలో మోతాదు తగ్గించి వేసారా లేక సెన్సార్ తన స్టాడర్ట్స్ ని మార్చుకుందా అని గుసగుసలాడుతున్నారు. ఎందుకంటే రాఘవేంద్రుడు చిత్రాల్లోని పాటల్లో చోటు చేసుకునే స్పైసీ సన్నివేశాలు కోసమే చాలా మంది రిపీట్ ఆడియన్స్ ఉంటారనేది నిజం.దానికి తగ్గట్లే పోస్టర్స్ పై కొబ్బరి చిప్పలు గట్రా వేసి ఊరిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన తాప్సీ ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో హాట్ ప్రాపెర్టీగా మారింది. మనోజ్ హీరోగా చేస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. సంగీత ప్రధానమైన ఈ చిత్రాన్ని మోహన్ బాబు కుమార్తె లక్ష్మీ ప్రసన్న మంచు నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











