భారత సంతతికి చెందిన ప్రసిధ్ద రచయిత్రి,పులిట్జర్ బహుమతి విజేత ఝంపాలహరి మేధావుల సెక్స్ సింబల్ గా ఎంపికయ్యారు. సూటిగా మాట్లాడటం,కంటి చూపులతో మతులు పోగొట్టడం వంటి లక్షణాలు ఆమెకి ఈ హోదా కల్పించాయి. ద డైలీ బీస్ట్ వెబ్ సైట్ నిర్వహించిన ధింకర్స్ మాన్స్ సెక్స్ సింబల్ ఓటింగ్ లో లాహరికి ఎనిమిదవ స్ధానం దక్కింది. మొదట స్ధానాన్ని సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి అనా ఇవనోవిక్ కొల్లగొట్టింది. మిగతా స్ధానాల్లో బర్రిటీష్ నవలా రచయిత్రి జేడీ స్మిత్,అమెరికన్ టీవీ నటిసారా సిల్వర్ మాన్ తదితరులున్నారు. లాహరి రాసిన అనకస్టమ్స్ ఎర్త్ ,ఇంటర్ ప్రెటర్ ఆప్ మెలోడీస్,ద నేమ్ సేక్ పుస్తకాలు ఆమెకు అఖండ పేరు తెచ్చి పెట్టాయి. నేమ్ సేక్ ..టబు ప్రధాన పాత్రలో సినిమాగా రూపొంది విశేష ఆదరణ పొందింది.