ఫోటోలు : అంతిమ యాత్రలో జియాఖాన్ బాయ్‌ఫ్రెండ్
ముంబై : నటి రబియా అమిన్ జీవితంలో ఇది ఎంతో బాధాకరమైన రోజు, ఆమె కూతురు...బాలీవుడ్ నటి జియా ఖాన్ సోమవారం రాత్రి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు బలవన్మరణానికి పాల్పడటాన్ని మించిన బాధ ఆ తల్లికి ఏముంటుంది?
జియా ఖాన్ ఆత్మహత్య చేసుకునే సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఆమె సూసైడ్ నోట్ కూడా రాయక పోవడంతో మరణానికి గల కారణాలు తెలియడం లేదు. బాయ్ ఫ్రెండుతో రిలేషన్ ఫెయిల్ కావడం, సినిమా అవకాశాలు లేక పోవడం లాంటి కారణాలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జియా ఖాన్ అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ముంబైలో జరుగగా, ఈ కార్యక్రమానికి ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలి, అతని తండ్రి ఆదిత్య పంచోలి కూడా హాజరయ్యారు.
జియా ఖాన్ ఆత్మహత్యకు ముందు చివరి సారిగా తన బాయ్ ఫ్రెండ్ సూరజ్‌కు కాల్ చేసింది. సూరజ్ వేరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని జియా అనుమానించిందని, ఆ కారణంగానే ఆమె హర్టయిందని, ఈ క్రమంలోనే బాధతో ఆత్మహత్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సూరజ్ పంచోలి, బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జరీనా వాహెబ్ తనయుడు. జియా ఖాన్‌తో అతనికి ఎప్పటి నుండో స్నేహం ఉంది.

తన గర్ల్ ఫ్రెండ్ జియా ఖాన్ అంతిమ యాత్రలో సూరజ్ తో పాటు అతని తల్లిదండ్రులు పాల్గొన్నారు. సూరజ్, జియా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, ఈ క్రమంలో వీరి మధ్య స్నేహం ముదిరి ప్రేమగా మారిందనే వాదనలూ ఉన్నాయి.

జియా ఖాన్ అంత్యక్రియల్లో ఆదిత్య పంచోలి కూడా పాల్గొన్నారు. జియా ఆత్మహత్య తర్వాత పోలీసులు ఆయన్ను కూడా ప్రశ్నించారు.

సోమవారం రాత్రి జియా ఖాన్ తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

జియా ఖాన్ మరణం తర్వాత...తన కొడుకు ప్రస్తావన తెస్తూ మీడియా హడావుడి ఎక్కువగా చేస్తుండటంపై ఆదిత్య పంచోలి జియా ఖాన్ ఇంటికి వచ్చిన సందర్భంగా రిపోర్టర్లపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసారు.

ముంబైలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరిగిన అంతిమ సంస్కారాల్లో సూరజ్ పాల్గొన్నాడు


Click it and Unblock the Notifications











