పేరు మార్చుకున్నాను...నా ఫేట్ మార్చండంటున్న హీరోయిన్
రామ్ గోపాల్ వర్మ నిశ్శబ్ద్ చిత్రంతో పరిచయమైన జియాఖాన్ ని అప్పట్లో ఎవరూ మరిచిపోలేకపోయారు కానీ ఆ తర్వాతే విచిత్రంగా ఆమె ఎవరికి గుర్తు లేకుండాపోయింది. దాంతో తన పేరులో ఏదన్నా డిఫెక్టు ఉందేమోనని డౌట్ వచ్చేసి పేరు మార్చుకున్నాను ...అని ట్వీట్ చేసింది. ఇంతకీ ఆ పేరు అంటే.. 'నఫీసా'. అది ఆమె అస్సలు పేరే. ఆ పాత పేరుతోనే కంటిన్యూ అవుతాను ఎలా ఉంది అని తన అభిమానుల అబిప్రాయాలు కనుక్కుంటోంది. ఇక నిశ్శబ్ద్ తర్వాత ఆమె హౌస్‌ఫుల్, గజని చిత్రాల్లో నటించింది కానీ క్లిక్ కాలేదు. ఇప్పుడు పూర్తి ఖాళి పడిపోయింది. ఎవరైనా ఆమె పేరు నచ్చి బుక్ చేస్తారేమోనని ఎదురుచూస్తోంది. రీసెంట్ గా ఆమె తన కన్నా పెద్ద వయస్సు ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎవరూ ఆ విషయమై ఆమెకు ఫోన్ లు చేయలేదట. మరి ఈ కొత్త పేరు ఆమెకు కలిసి వచ్చి అవకాశాలను తెచ్చి పెడుతుందంటారా...లేక పేరులో ఏముంది నటనలో ఉండాలి కాని అంటారా.


Click it and Unblock the Notifications











