'ఇలా జరుగుతుందని ముందు వూహించలేకపోయాను. చాలా అన్యాయం జరిగింది ఉంది. ఈ సినిమాతో ఓ పాఠం నేర్చుకున్నాను. ఇక మీదట రెండో హీరోయిన్ గా నటించబోను' అంటూ 'గజిని' సెకెండ్ హీరోయిన్ జియా ఖాన్ తెగ బాధపడుతోంది. సినిమా కూడా విడుదలై విజయాన్ని మంచి కెలెక్షన్స్ రాబట్టుతోంది. అయితే జియా ఖాన్ తెగ భాధపడిపోతోంది. తనకు చిత్ర ప్రచారంలోనూ, ఏ దశలోనూ ప్రాధాన్యం ఇవ్వలేదనీ, తను ఉన్న సన్నివేశాలకీ, పాటలో కొంత మేరకు కత్తెర వేశారని అందరితో చెప్పుకుని వాపోతోంది. అయినా అమీర్‌ఖాన్ ఇలా చేస్తారనుకోలేదు అంటూ జియా చెప్తోంది.