జియాఖాన్ కేసు సీబీఐ విచారణకు...

జూన్ 3న జుహూలోని తన నివాసంలో జియా ఉరివేసుకున్న విషయం విదితమే. జూన్ 10న ఆమె ప్రియుడు సూరజ్ పాంచోలీని పోలీసులు అరెస్టు చేశారు. అతనే జియాను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటాడని పోలీసులు ఆరోపించారు. జులై 1న సూరజ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పోలీసులు జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంఛోలిని విచారించారని, తన కూతురు హత్య కేసును సిబిఐ దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని రబియాఖాన్ పిటిషన్‌లో కోరారు. పోలీసులు సరైన విధంగా విచారణ జరపకుండా తన కూతురిది ఆత్మహత్యగా తేల్చేశారని ఆమె ఆరోపించారు. ఆదిత్య పంఛోలి కుమారుడైన సురజ్ తన కుటుంబ పలుకుబడిని ఉపయోగించి కేసును తప్పుదోవ పట్టించారని ఆమె అన్నారు. జియాఖాన్‌ను హత్య చేసిన తర్వాతనే ఉరివేశారని రబియాఖాన్ ఆరోపించారు. ఈ ఆరోపణకు తగిన కారణాలున్నాయని ఆమె తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న వారి కళ్లు తేలిసినట్లు, నాలుక బయటికి వచ్చి ఉండాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో జియా ఆ స్థితిలో లేదని తెలిపారు.
ఘటనా స్థలంలో మృతురాలికి ఉరివేసిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. జియాఖాన్ ముఖం, శరీరంపై గాయాలున్నాయని పేర్కొన్నారు. జియా పెదవి కుడి పక్కన గాయమైందని, ఎడమ చేతికి బలవంతంగా తాడుతో కట్టబడినట్లు ఆనవాలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓ పలుచని గుడ్డతో తనకు తాను ఉరివేసుకుందని పోలీసులు తమ విచారణలో పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక మాత్రం ఇందుకు విరుద్ధంగా పలుచని గుడ్డను ఉపయోగించలేదని తెలిపింది. జియా తనకు తాను ఉరివేసుకున్నట్లుగా ఆనవాళ్లు లేవని నివేదికలో నిపుణులు పేర్కొన్నారు. సిసిటీవీ ఫుటేజ్‌ను పరిశీలించినట్లయితే ట్రాక్ సూట్ ధరించిన జియా తన ఇంటిలోకి ప్రవేశించిన కొద్ది నిమిషాల్లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
జియా చనిపోయిన తర్వాత నైట్ గౌన్‌లో ఉంది, అయితే ఉరివేసుకోవాలనుకుంటే డ్రెస్ ఎందుకు మార్చుకుంటుందని పిటిషన్‌లో ప్రశ్నించారు. అంత ఎత్తులో ఉన్న సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకోవాలంటే స్టూల్ లేకుండా సాధ్యం కాదు.. కానీ జియా ఇంట్లో స్టూల్ లేదు. ఘటనా సమయంలో ఏసీ ఆన్‌లో ఉన్నప్పటికీ తన ఇంట్లోని కిటికి తెరిచే ఉంది. ఆ కిటికి నుంచి ఎవరైన తన రూమ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. జియా మరణానికి ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంఛోలియే కారణమని రబియా ఖాన్ భావిస్తోంది. కాగా అమితాబ్ బచ్చన్‌తో నిషద్, అమీర్ ఖాన్‌తో గజిని, హౌస్‌ఫుల్ సినిమాలో అక్షయ్ కుమార్‌తో జియాఖాన్ నటించింది.


Click it and Unblock the Notifications











