జియా కేసు : సూరజ్‌కు బెయిల్ నిరాకరణ
సూరజ్ పంచోలి కారణంగానే జియా ఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. జియా ఖాన్ సూసైడ్ లేఖ ఈ విచారణలో కీలకంగా మారింది. పోలీసులు ఆ లేఖ ఆధారంగా ఎన్నో విషయాలు వెలుగులోకి తేగలిగారు. ఆ లేఖ ఆధారంగానే పోలీసులు సూరజ్ పంచోలిని అరెస్టు చేసారు.
జియా ఖాన్ జూన్ 3న ముంబై జుహులోని తన అపార్టుమెంటులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణం కేవలం కెరీర్లో ఆటుపోట్ల వల్ల ఒత్తిడే అని భావించి కేసు నమోదు చేసుకున్నారు. కానీ జియా ఖాన్ రాసిన సూసైడ్ నోట్ దొరకడంతో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
జియా తన లేఖలో బాయ్ ఫ్రెండ్ సూరజ్ కారణంగా మెంటల్‌గా, ఫిజికల్‌గా బాధను అనుభవించానని, సూరజ్ పంచోలి కారణంగా తాను రేప్ చేయబడ్డానని, అతను తన జీవితాన్ని నాశనం చేసాడని పేర్కొంది. జియా రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు సూరజ్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.


Click it and Unblock the Notifications












