twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోయిన్‌ది హత్యే అని తేల్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    ముంబై: బాలీవుడ్ హీరోయిన్ జియాఖాన్ కేసు మళ్లీ చర్చనీయాంశం అయింది. తాజాగా విడుదలైన ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆమె మరణం వెనక గల షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదిక ప్రకారం జియా ఖాన్ హత్యకు గురైనట్లు బలమైన ఆధారాలు లభించినట్లు స్పష్టమవుతోంది.

    ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం, కలీనా ఫోరెన్సిక్ లాబోరేటరీ విడుదల చేసిన రిపోర్టుల్లో జియా ఖాన్ చేతివేళ్ల గోళ్ల కింద ఇతర వ్యక్తుల రక్తం, మాంసం అవశేషాలు లభించాయని తెలుస్తోంది. అదే విధంగా ఆమె బాడీలో కొంత ఆల్కహాల్ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మద్యం తాగించడం వల్ల ఆమెను ఉరివేసి హత్య చేయడం సులభమవుతుందని ఆ రిపోర్టు సారాంశం. హత్య సమయంలో పెనుగులాట వల్ల ఆమె వేలి గోళ్లలోకి సదరు వ్యక్తుల రక్తం, మాంసం వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు.

    కొన్ని రోజుల క్రితం జియా ఖాన్ తల్లి రబియా అమిన్ తన బిడ్డ హత్యకు గురైందని, విచారణ జరిపించాలని బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, నిందితుడు సూరజ్ పంచోలిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆమె తన పిటీషన్లో డిమాండ్ చేసింది. రబియా అమిన్ తన పిటీషన్లో ముఖ్యమైన విషయాలు పేర్కొంది. వాటిని పరిశీలిస్తే జియా ఖాన్ ఆత్యహత్య చేసుకోలేదని, హత్య చేయబడిందనే వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి.

    English summary
    The Jiah Khan case is back in news, after the new Forensic report revealed a shocking information about the death of the actress. If the recent reports are to be believed, there seems strong proof that hints that Khan was possibly murdered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X