twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జిగేలు రాణి' సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కావడం లేదు, మోసం!

    |

    Recommended Video

    Rangasthalam Movie Songs Controversy

    వేసవిలో విడుదలైన రాంచరణ్ రంగస్థలం చిత్రం టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, బాహుబలి తరువాత టాలీవుడ్ లో అంతటి ఘన విజయంగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని టాలీవుడ్ గొప్ప చిత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రతి పాత్రకు అర్థవంతమైన ప్రాధాన్యత ఇచ్చారు. దేవిశ్రీ సంగీతం కూడా అద్భుతంగా అలరించింది. సుకుమార్ చిత్రాలలో ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో కూడా జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని జిగేలు రాణి సాంగ్ పాడిన సింగర్ గంటా వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

     దేవిశ్రీ మ్యాజిక్

    దేవిశ్రీ మ్యాజిక్

    దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మాస్ ఆడియన్స్ ని ఎప్పుడూ నిరాశ పరచడు. రంగస్థలం చిత్రం 1980 నేపథ్యంలో వచ్చినప్పటికీ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

    స్టెప్పులు వేసేలా

    స్టెప్పులు వేసేలా

    ఈ చిత్రంలోని జిగేలు రాణి ఐటమ్ సాంగ్ ని ఆడియన్స్ స్టెప్పులు వేసేలా కంపోజ్ చేసి దేవిశ్రీ తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఆ గట్టునుంటావా, జిగేల్ రాణి పాటలని జానపద పాటలు పాడేవారితో దేవిశ్రీ పాడించారు.

    అన్యాయం జరిగింది

    అన్యాయం జరిగింది

    జిగేలు రాణి సాంగ్ పాడిన గంటా వెంకట లక్ష్మి ఇటీవల మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. జిగేలు రాణి సాంగ్ పాడే అవకాశం రావడం చాలా అదృష్టమని తెలిపింది. కానీ ఆ పాట పాడినందుకు సంతోషించాలో, బాధపడాలో అర్థం కానీ పరిస్థితి నెలకొని ఉందని తెలిపింది.

    మధ్యవర్తి ద్వారా

    మధ్యవర్తి ద్వారా

    తాను పాడిన బుర్ర కథ, జానపద గేయాలని దర్శకులు సుకుమార్, దేవిశ్రీ యూట్యూబ్ లో చూశారట. దీనితో జిగేలు రాణి పాటకు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. మధ్యవర్తి ద్వారా చెన్నై కు వెళ్లి రెండురోజుల్లో పాట పాడి వచ్చా. చాలా బాగా పాడానని దేవిశ్రీ మెచ్చుకున్నారు. తరువాతి చిత్రాల్లో ఇలాంటి సాంగ్స్ ఉంటె తప్పకుండా అవకాశం ఇస్తానని అన్నారు.

    మోసం జరిగింది

    మోసం జరిగింది

    పాట పాడినందుకు తనకు ఒక్కరూపాయి కూడా దక్కలేదని వెంకట లక్ష్మి తెలిపింది. భర్త మరణించి కిరాణా కొట్టుతో జీవితం గడుపుతున్నానని తెలిపింది. నేను పేద మహిళని దేవిశ్రీ కి తెలియకపోవచ్చు. కానీ ఆ మధ్యవర్తికి తెలుసు. డబ్బు మొత్తం అతడే తీసుకుని మోసం చేశారని వెంకట లక్ష్మి ఆరోపించింది.

    అతడి విషయంలో కూడా

    అతడి విషయంలో కూడా

    ఆ గట్టునుంటావా సాంగ్ విషయంలో కూడా స్వల్ప వివాదం రేగిన సంగతి తెలిసిందే. శివనాగులు ఈ పాటని పాడగా సినిమాలో మాత్రం దేవిశ్రీ పాడారు. సాంకేతిక సమస్య వలనే శివనాగులు వైస్ తొలగించవలసి వచ్చిందని చిత్ర యూనిట్ ఆ సమయంలో వివరణ ఇచ్చింది.

    English summary
    Jigelu Rani Song Singer Ganta Venkata Lakshmi responds on her remuneration. She responds on controversy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X