రాంచరణ్ కోసం జిగేల్ రాణి వచ్చేసింది.. మాస్ సెప్పులతో చెర్రీ రచ్చ రచ్చ
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ మార్చి 27న తన 32వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఆయన నటించిన రంగస్థలం చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చెర్రీ జన్మదినాన్ని పురస్కరించుకొని రంగస్థలం చిత్రంలోని జిగేల్ రాణి అనే పాటను విడుదల చేశారు.
రంగస్థలం చిత్రంలోని ఐటమ్ సాంగ్‌లో అందాలతార పూజా హెగ్డే ప్రత్యేకంగా నర్తించింది. ఓ ముద్దు పెట్టవే జిగేల్ రాణి.. కన్నైనా కొట్టవే జిగేల్ రాణి అంటూ రాంచరణ్ పాటను అందుకొన్నారు.
దాంతో జిల్ జిల్ జిల్ జిగేల్ రాజా.. ఉన్నది అడిగితే నేను లేదంటానా? కాదంటానా అంటూ పూజాహెగ్డే షుషారుగా సమాధానం ఇచ్చింది. ఈ పాటలో చరణ్ వేసిన మాస్ స్టెప్స్ అభిమానుల చేత కేక పెట్టించడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
jigelu rani pooja hegde ram charan rangasthalam movie jigelu rani song రాంచరణ్ రంగస్థలం మూవీ పూజా హెగ్డే జిగేలు రాణి పాట


Click it and Unblock the Notifications