సంచలనం: చేతులు కలపబోతున్న జిగ్నేశ్-పా.రంజిత్, ఏం చేయబోతున్నారు?

Recommended Video

చేతులు కలపబోతున్న జిగ్నేశ్-పా.రంజిత్.. ఏం చేయబోతున్నారు ?

జిగ్నేశ్.. బహుజన రాజకీయాలకు దిక్సూచిగా కనిపిస్తున్న దళిత తేజం. పా.రంజిత్.. కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్యంలోనే ఉన్న సినీ ఇండస్ట్రీలోకి అనూహ్యంగా దూసుకొచ్చిన దళిత డైరెక్టర్. అణగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చిన ఈ ఇద్దరి ఆలోచనల్లోనూ కొంత సారుప్యత ఉంది. అది జాతులు, సాంస్కృతిక స్పృహకు సంబంధించిన విషయం. అలాంటి ఈ ఇద్దరూ చేతులు కలపబోతుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ఆసక్తికర చర్చకు దారితీసిందనే చెప్పాలి.

ఇంతకీ ఏం చేయబోతున్నారు:

ఇంతకీ ఏం చేయబోతున్నారు:

పా.రంజిత్, జిగ్నేష్ మేవాని చేతులు కలుపబోతున్న విషయం రాజకీయాలకు సంబంధించినది కాదు. సినిమాకు సంబంధించినది. రంజిత్ తన సినిమాలోని ఓ పాత్రకు జిగ్నేశ్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తే బాగుంటుందని భావించాడట. ఇదే విషయాన్ని ఇటీవల ఆయనతోనూ ప్రస్తావించాడట.

 ఎక్కడ కలుసుకున్నారు?:

ఎక్కడ కలుసుకున్నారు?:

దళితులపై దాడులు, బీజేపీ ఏకపక్ష పోకడలపై గట్టిగా ప్రతిఘటిస్తున్న గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని.. దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పా.రంజిత్ జిగ్నేశ్‌తో భేటీ కావడం.. తాజా ఊహాగానాలకు ఊతమిచ్చింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం:

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం:

పా.రంజిత్ సినిమాలో జిగ్నేశ్ మేవాని గెస్ట్ పాత్ర చేయబోతున్నారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఒక కథనాన్ని ప్రచురించడంతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుంది. ఆ పాత్ర జిగ్నేశ్‌కు బాగా సూట్ అవుతుందని పా.రంజిత్ భావిస్తున్నారట. అందుకే పట్టుబట్టి మరీ జిగ్నేశ్ తోనే చేయించాలనుకుంటున్నాడని తెలుస్తోంది.

నిజమేనా?:

నిజమేనా?:

మరో విషయమేంటంటే.. పా.రంజిత్ ప్రపోజల్‌కు జిగ్నేశ్ కూడా ఓకె చెప్పాడన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆ పాత్రలో కనిపనించడానికి జిగ్నేశ్ కూడా ఉత్సాహం కనబరుస్తున్నారట. అయితే ఇందులో నిజానిజాలెంతన్న దానిపై మాత్రం ఇంతవరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు.

ఎలా చూపిస్తాడో?:

ఎలా చూపిస్తాడో?:

కుల వివక్ష, అణగారిన వర్గాల సాధికారతపై రాజకీయాల్లో అటు జిగ్నేశ్, సినిమా రంగంలో ఇటు పా.రంజిత్ తమ వంతు కృషి చేస్తూ వస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి పనిచేయబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన జిగ్నేశ్‌ను పా.రంజిత్ ఎలా చూపించబోతున్నాడన్నది ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.

 పోస్ట్ ప్రొడక్షన్‌లో 'కాలా'..:

పోస్ట్ ప్రొడక్షన్‌లో 'కాలా'..:

కబాలితో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పా.రంజిత్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో వరుసపెట్టి సినిమాలు చేస్తుండటం విశేషం. ప్రస్తుతం రజనీతో పా.రంజిత్ చేస్తున్న 'కాలా' పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. ఈ వేసవికి 'కాలా' ప్రేక్షకుల ముందుకు రావచ్చు. ఇదిలా ఉంటే, తన తర్వాతి సినిమా కూడా రజనీకాంత్ పా.రంజిత్ తోనే చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X