ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకుని ‘మాస్క్’చేశాం

By Srikanya

హైదరాబాద్ : నాకు తెలిసిన సూపర్‌హీరోలు అంటే ఎన్టీఆర్, ఎమ్జీఆర్. వారి సినిమాల నే 'మాస్క్'లో ఆదర్శంగా తీసుకోవడం జరిగింది అని చెప్పారు మిస్కిన్ దర్శకత్వంలో జీవా తమిళంలో నటించిన చిత్రం ' ముగమూడి'. ఈ సినిమాను 'మాస్క్' పేరుతో మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్ ప్రై.లిమిటెడ్ ద్వారా నిర్మాత ఆర్బీ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 31న 'మాస్క్' విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవా పై విధంగా స్పందించారు.

అలాగే ....'మాస్క్'లో సూపర్‌హీరోగా చేశాను. అయితే ఆ పాత్రకు మానవాతీత శక్తులేం ఉండవు. తనలో అంతర్గతంగా దాగున్న ఓ మానవశక్తే ఆ పాత్రను సూపర్ హీరోను చేస్తుంది. గతంలో వచ్చిన కొన్ని సూపర్‌హీరోల చిత్రాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ సినిమాను మలిచామని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. వాటికీ 'మాస్క్'కీ సంబంధం ఉండదు. ఇది పూర్తి భిన్నమైన నేపథ్యం. కనిపించడానికి సూపర్‌హీరో సినిమాలా అనిపించినా... మన దేశానికి చెందిన భావోద్వేగాలన్నీ ఇందులో మెండుగా ఉంటాయి అన్నారు.

ఇక చాలా ఇంట్రిస్టింగ్ నేపథ్యంతో ఓ అద్భుతంగా మిస్కిన్ ఈ సినిమాను తెరకెక్కించారు. 90 శాతం రాత్రి సమయంలోనే ఈ కథ నడుస్తుంది. హాంకాంగ్‌లో పేరిన్నికగన్న ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేశాను. ఇందులో పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. కుంగ్‌ఫూలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలాగే సంగీత దర్శకుడు కె పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. టోటల్‌గా 'మాస్క్' ఓ యూనివర్సల్ ఫిలిం అని జీవా తెలిపారు.

యూటీవీవారు తమిళంలో నిర్మించిన ఈ చిత్రం అనువాద హక్కులను ఎంతో పోటీ మీద దక్కించుకున్నామని, ఇందులో యాక్షన్ సీన్స్ కొత్తగా ఉంటాయని పారాస్‌జైన్ చెప్పారు. గ్లామర్‌తో పాటు అభినయానికి కూడా ఆస్కారమున్న పాత్రను ఇందులో పోషించానని కథానాయిక పూజా హెగ్డే చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: కె., కెమెరా: సత్య, ఎడిటింగ్: గౌగిన్, నిర్మాతలు: ఎన్.వి.ప్రసాద్, పారస్‌జైన్, సమర్పణ: ఆర్.బి.చౌదరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిస్కిన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X