»   » బాలకృష్ణ నో అన్నాడు...బ్రహ్మానందం తో షూటింగ్

బాలకృష్ణ నో అన్నాడు...బ్రహ్మానందం తో షూటింగ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించగా తమిళంలో సూపర్‌ హిట్టయిన చిత్రం ‘జిల్లా'. ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తారంటూ చాలా కాలంగా వార్తలు వినిపించాయి. బాలకృష్ణ,కళ్యాణ్ రామ్ లతో రీమేక్ చేస్తారని,చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారని, రవితేజ-వెంకటేష్ కాంబినేషన్ ఇలా రకరకాల వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలకృష్ణతో ఫైనల్ అయినట్లే అని చెప్పుకున్నారు.

బాలకృష్ణ స్పెషల్ స్క్రీనింగ్ చూసి మార్పులు చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని డబ్బింగ్ చేసి విడుదల చేయటానికి సిద్దం చేస్తున్నారు. అంతేకాదు డబ్బింగ్ వెర్షన్ కోసం బ్రహ్మానందంపై కామెడీ ట్రాక్ తీసి కలిపి వదల నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Jilla dubbing with Brahmanandam comedy track

తీవ్ర పోటీ మధ్య ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ దక్కించుకుంది. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి సమర్పణలో తమటం, కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందించబోతున్నారు. నామన శంకర్‌రావు సహ నిర్మాత. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, ప్రదీప్‌ రావత్‌, సంపత్‌రాజ్‌ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి ఆర్‌.టి. నేసన్‌ దర్శకుడు.

ఈ సినిమా గురించి నిర్మాతలు కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు వెర్షన్‌ కోసం తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్‌, సురేఖావాణి తదితరులపై ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

Jilla dubbing with Brahmanandam comedy track

ఆర్‌.బి. చౌదరి తనయుడు జీవా ఇందులో ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం విశేషం. తమిళనాట కాసుల వర్షం కురిపించి, విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్నీ అమితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో తెలుగు వెర్షన్‌ టైటిల్‌ను ప్రకటిస్తాం'' అని చెప్పారు.

మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: డి. ఇమాన్‌, ఛాయాగ్రహణం: గణేశ్‌ రాజవేలు, కూర్పు: డాన్‌ మ్యాక్స్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.టి. నేసన్‌.

English summary
Featuring Vijay and Mohan Lal in the leads, while Kajal Agarwal plays the heroine, Jilla is a runaway hit in Kollywood. After dabbling with the idea of remaking it for couple of years, finally the film is heading for a dubbed release in Telugu. In telugu dubbing version..producers are shooting comedy track on Brahmanandam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu