twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జిస్మ్-2...ఒక ఫోర్న్ స్టార్ జర్నీ: మహేష్ భట్

    By Bojja Kumar
    |

    ముంబై: ఇండో కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న తాజా చిత్రం 'జిస్మ్-2' ఆగస్టు 3న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ ఈచిత్రానికి ప్రచారం కల్పించే పనిలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇదొక సంప్రదాయక దారిలో నడిచే సినిమా. ఒక నీలిచిత్రాల తార జీవన ప్రయాణమే ఈచిత్రం. కామ వ్యాపారం జరిగే మార్కెట్ నుంచి వచ్చిన మహిళ ప్రేమకోసం తపించిన తీరు ఇందులో ప్రముఖంగా ఉంటుందన్నారు. ఈచిత్రం శృంగార ప్రియులకు మంచి థ్రిల్ ఇస్తుందని మహేష్ భట్ చెప్పుకొచ్చారు. ఇతర సినిమాలకు ఈ చిత్రం పూర్తి భిన్నమైన ఎమోషన్సల్ తో కూడిన చిత్రమని చెప్పుకొచ్చారు.

    ఈ చిత్రం కోసం తొలుత మల్లికా షెరావత్, బిపాసా బసులను అనుకున్నప్పటికీ...వారు దీనికి సరిపోరని భావించిన దర్శకురాలు పూజా భట్ సన్నీలియోన్‌ను ఎంపిక చేసిందని, ఫోర్న్ స్టార్ కాబట్టి దర్శకురాలి భావనలకు తగిన విధంగా నట్టిసుందనే ఉద్దేశ్యంతోనే ఆమెను తొలిసారి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.

    ఈచిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మల్టీ డైమన్షన్ సంస్థ వారు ఈచిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 200 థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శృంగార మూవీ కాబట్టి మంచి కలెక్షన్లు వస్తాయనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు.

    పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

    English summary
    Filmmaker Mahesh Bhatt, who is busy promoting his movie Jism 2, admits that Sunny Leone starrer film is an erotic thriller. But what he insists is that Jism sequel is conservative and traditional in a way. He highlights that the movie has an emotional quotient, which is very different from other movies. Addressing a promotional event in Mumbai on Thursday, Mahesh Bhatt said, "It is a conservative... traditional film in a way. It is about a journey of a porn star, her longing for real love. It is a journey of a woman from the lust market who peddles lust to people's anguish. It is her quest for love."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X