'జిస్మ్ 2' తెలుగు వెర్షన్ విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్: మహేష్ భట్ కుమార్తె పూజా భట్ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం 'జిస్మ్ 2'. రణదీప్ హుడా, సన్నీలియోన్ ప్రధాన పాత్రధారులుగా చేసిన ఈ చిత్రాన్ని ఆ పేరుతోనే తెలుగులోకీ అనువదించారు. ఆగస్టు 3న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌భట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చారు. అరుణోదయ సింగ్, ఇమ్రాన్ జాహిద్, మోహన్ అగాసె తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కె.చెంచురెడ్డి విడుదల చేస్తున్నారు.
కె.చెంచురెడ్డి మాట్లాడుతూ ''ఒక నటి జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. ఒక కేసు దర్యాప్తు విషయమై ఆమెకి దగ్గరవుతాడు ఓ పోలీసు అధికారి. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. పూజా భట్ చిత్రాన్ని ఉత్కంఠ రేకెత్తించేలా తీర్చిదిద్దారు. ఈ క్రేజీ చిత్రం హక్కులు పొందినందుకు ఆనందంగా ఉంది. యువతతో పాటు అన్ని వయసులవారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది'' అని చెప్పారు.
ఇక ఇందులో రణదీప్‌హుడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా నటించారు. ఒక కీలక పాత్రను అరుణోదయసింగ్ చేశారు. శృంగార తారగా సన్నీకి ఎంతో ప్రాచుర్యం ఉంది. ఆమె నటించిన చిత్రం కావడంతో యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 3న చిత్రం విడుదల కానుంది
జాన్‌అబ్రహాం, బిపాసా జంటగా రూపొందిన సూపర్ హిట్ 'జిస్మ్'కి సీక్వెల్‌గా పూజాభట్ దర్శకత్వంలో మహేష్ భట్ నిర్మించిన చిత్రం 'జిస్మ్ 2'. ప్రముఖ శృంగార తార సన్నీ లియోన్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచింది. దానికి కారణం ఉల్లిపొరలాంటి తెల్లని చీరలో సన్నీతో ఒక ఫొటోషూట్ చేసి, పూజా విడుదల చేసిన పోస్టర్. అప్పట్నుంచి ఈ చిత్రం విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











