ఐదుగురు హీరోలతో ...జెకె భారవి ‘శ్రీ జగద్గురు ఆదిశంకర’
లవకుశ తర్వాత అంత గొప్ప సినిమా అవుతుంది. పాటలు విన్నాను. అద్భుతం ..అచ్చం కీరవాణి పాటల్లా ఉన్నాయి అన్నారు సి.అశ్వనీదత్. రచయిత జె.కె.భారవి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం 'శ్రీ జగద్గురు ఆదిశంకర'. ఉగాది పర్వదినాన చిత్రీకరణ ప్రారంభమవుతుంది. గ్లోబల్ పీస్ క్రియేటర్స్‌పై రూపొందనున్న ఈ చిత్రం విశేషాలు తెలియజేయడానికి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అతిథిగా పాల్గొన్న అశ్వనీదత్ పై విధంగా స్పందించారు. మరో అతిథి కొండా కృష్ణం రాజు మాట్లాడుతూ - 80 ఏళ్ల చలన చిత్ర చరిత్రలో లవకుశ, మాయాబజార్ చిత్రాల కోవకి ఇది చెందుతుంది అన్నారు.
చిత్రసంగీత దర్శకుడు నాగ్ శ్రీవత్స మాట్లాడుతూ- ఈ సినిమాకి పాటలు ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. చిత్రనిర్మాణసారథి జయశ్రీదేవి మాట్లాడుతూ- ఈ సినిమా గురించి భారవి చెప్పినప్పుడు శ్రీ మంజునాథ, అన్నమయ్య, శ్రీరామదాసులా మంచి కథ ఉంటేనే ఈ సినిమా చేయమన్నాను. ఈ కథ చాలా బాగుంది అని చెప్పారు. జె.కె.భారవి మాట్లాడుతూ- ఈ టైటిల్ వినగానే ఐదుగురు హీరోలు నటించడానికి అంగీకరించారు. ఈ చిత్రం యువతకు ఒక పర్సనాల్టీ డెవలప్‌మెంట్‌లా, కౌన్సిలింగ్ క్లాస్‌లా ఉపయోగపడుతుంది. ఉగాదికి ఈ చిత్రాన్ని ఆరంభిస్తాం అన్నారు. ఈ చిత్రానికి కథ- మాటలు- స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జె.కె.భారవి.


Click it and Unblock the Notifications











