ప్రముఖ సినీ రచయిత జేకే భారవి ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తన తల్లిని చూసేందుకు హైదరాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తుండగా మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరు బైపాస్ రోడ్డులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. జాతీయ రహదారిపై ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న జె.కె.భారవితో పాటు ఆయన ఇంట్లో పనిచేస్తున్న మారుతి, లూటీలకు స్వల్ప గాయాలయ్యాయి. పెబ్బేరుకు బైపాస్ సమీపంలో మలుపు వద్ద వేగంగా వెళ్తూండటంతో అదుపు తప్పి గోతిలోకి వెళ్ళింది. డ్రైవరకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అక్కడ ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు అక్కడికి చేరుకుని వారిని ఇన్నోవా వాహనం నుంచి బయిటకు తీసారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు 108 కు సమాచారం అందించడంతో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సలహామేరకు రచయిత భారవిని హైదరాబాద్ కు తరలించారు.
Story first published: Monday, June 1, 2009, 15:35 [IST]