జెకె భారవి విప్రనారాయణ
పౌరాణిక, చారిత్రక సినిమా కథలు రాయడంలో దిట్ట అయిన జెకె భారవి తాజాగా విప్రనారాయణ అనే సినిమాకు కథను తయారు చేస్తున్నారు. గతంలో ఆయన కథలు రాసిన అన్నమయ్య, మంజునాథ, శ్రీ రామదాసు సినిమాలు విజయవంతమయ్యాయి. కె రాఘవేంద్రరావు త్వరలో తీయనున్న పాండురంగ మహత్యం సినిమాకు కూడా భారవి కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. విప్రనారాయణ సినిమాను కెసి శేఖర్‌బాబు నిర్మించనున్నారు. ఈ సినిమాకు దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదు. అంటే పౌరాణిక, చారిత్రక సినిమాల విషయంలో రచయితగా భారవి దర్శకుల కంటే ముఖ్యుడైపోయారన్న మాట.


Click it and Unblock the Notifications