twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేఎన్‌యూ ఘటనతో ఉలిక్కిపడ్డ జనం.. హీరోయిన్ తాప్సి ఆవేదన

    |

    జేఎన్‌యూ (జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ) ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాలపై పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఈ దుర్ఘటనపై తమ స్పందన తెలుపుతూ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా సందేశమిస్తున్నారు. హీరోయిన్‌ స్వరా భాస్కర్‌, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ ట్విటర్‌ వేదికగా జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక దాడిని తీవ్రంగా ఖండించారు.

    ముసుగులు ధరించిన కొందరు దుండగులు జేఎన్‌యూ లోకి వచ్చి..

    ముసుగులు ధరించిన కొందరు దుండగులు జేఎన్‌యూ లోకి వచ్చి..

    ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు దుండగులు జేఎన్‌యూ లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారు. సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విచక్షణా రహితంగా విద్యార్థులపై రాళ్లతో, ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దుశ్చర్యలో విద్యార్థులతోపాటు జేఎన్‌యూ ఎస్‌యూ ప్రెసిడెంట్‌, ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

    దాదాపు 19 మంది విద్యార్థులు.. తీవ్ర గాయాలు

    దాదాపు 19 మంది విద్యార్థులు.. తీవ్ర గాయాలు

    అంతేకాదు సదరు దుండగులు వర్సిటీ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 19 మంది విద్యార్థులతో పాటు వర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌ ఆయిశీ ఘోష్‌ తీవ్రంగా గాయాలపాలయ్యారు. దీంతో ఈ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిని ఖండిస్తూ బాలీవుడ్ తారలు ట్వీట్స్ చేశారు.

    గేట్‌ బయట భారీగా గుమిగూడండి.. స్వ‌రా భాస్క‌ర్ రియాక్షన్

    జేఎన్‌యూ పూర్వ విద్యార్ధి న‌టి స్వ‌రా భాస్క‌ర్. పైగా ప్రస్తుతం ఆమె త‌ల్లి జేఎన్‌యూలో ప్రొఫెస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు కూడా. ఈ నేప‌థ్యంలో గాయలపాలైన వారికి సహాయం చేయమని కోరింది స్వ‌రా భాస్క‌ర్. అంతేకాదు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించిన ఆమె.. ''అర్జెంట్‌ అప్పీల్‌!!!. ఢిల్లీ వాసుఅంతా బాబా మంగ్నాథ్‌ మార్గంలోని ప్రధాన గేట్‌ బయట భారీగా గుమిగూడండి. ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్లను అడ్డుకునేందుకు ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి తీసుకురండి'' అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.

    నిజంగా షాకింగ్ ఘటన.. షబానా అజ్మీ

    స్వరా భాస్క‌ర్ సోషల్ మీడియా పోస్టు చూసి షబానా అజ్మీ కూడా రియాక్ట్ అయింది. ''ఇది నిజంగా షాకింగ్ ఘటన. ఈ చర్యకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి'' అని పేర్కొంటూ క్యాంపస్‌లో జరిగిన హింసకు సంబంధించిన వీడియోను ఆమె పంచుకుంది.

    పిల్లల భవిష్యత్‌కు బాటలు పడాల్సిన చోటే.. తాప్సి ఆవేదన

    పిల్లల భవిష్యత్‌కు బాటలు పడాల్సిన చోటనే ఇలాంటి దుస్థితి తలెత్తింది. ఇది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొంది హీరోయిన్ తాప్సి. ఇది ఎప్పటికీ మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆమె ఆవేదన చెందింది.

    English summary
    Delhi's Jawaharlal Nehru University (JNU) Sunday evening when some masked miscreants entered the university campus and attacked students. Bollywood celebrities reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X