తెలుగులో జోథా అర్బర్ లేట్

రితిక్ రోషన్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన జోథా అక్బర్ సినిమా తెలుగు వెర్షన్ విడుదల ఆలస్యమవుతోంది. హిందీ వెర్షన్ ఈ నెల 15వ తేదీన విడుదలవుతోంది. అయితే తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను ఇప్పుడే విడుదల చేయడం లేదట. తెలుగులో ఈ సినిమా మార్చి 6వ తేదీన విడుదలవుతోంది. మహేష్ బాబు అతిధి సినిమాతో దక్షిణ భారతదేశం కాలు పెట్టిన యుటివి ప్రొడక్షన్ హౌస్ జోధా అక్బర్ ను విడుదల చేయబోతోంది. విడుదలకు ముందు పెద్ద యెత్తున ప్రమోషన్ వర్క్ చేయాలని కూడా అనుకుంటోంది. తమిళం వెర్షన్ లో కూడా మార్చి 6వ తేదీనే జోథా అక్బర్ విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











