Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మూడు జతల జీన్స్ మాత్రమే ఉన్నాయన్న స్టార్ హీరో
సమాజ సేవ చేయడానికి కేవలం బిలియనీర్లు మాత్రమే ముందుకు వస్తే సరిపోదని, దేశంలోని యువత ఈ బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేర్కొన్నాడు. నటుడు రాహుల్బోస్తో కలిసి ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో జాన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. సమాజానికి సేవ చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకొచ్చి, తమకున్నదానిలో ఎంతోకొంత ఇచ్చినప్పుడే ఆర్థిక అసమానతలు సమసిపోతాయని చెప్పాడు.
సామాన్య జీవితం గడిపేందుకే తాను ఇష్టపడతానని, దుస్తులను, ఇతర వస్తువులను పేదలకు ఇచ్చేస్తుంటానని చెప్పాడు.ఈ సందర్భంగా చెప్పాడు. 'ద ఫౌండేషన్' కోసం నిధులు సమీకరించేందుకు ఏర్పాటు చేస్తున్న సంగీత కచేరీ వివరాలను ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించాడు. ఇక ఈ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హాలీవుడ్ ఎంట్రీ అనగానే సెన్సేషన్ సీన్స్ చేయడానికి రెడీ అంటున్నాడు జాన్. హాలీవుడ్లో స్క్రిప్టు డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి రెడీ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు.
తనకు న్యూడ్ సీన్స్ చేయడం కొత్తేమీ కాదని, ఇప్పటికే బాలీవుడ్లో చేసానని... అయితే సెన్సార్ బోర్డు వాటిని అనుమతించ లేదని చెప్పుకొచ్చాడు. హాలీవుడ్లో అయితే ఇలాంటి సమస్యలు ఉండవని, బేషుగ్గా న్యూడ్ సీన్స్ చేయడానికి ఒప్పుకుంటానని అంటున్నాడు. అయితే ఇకపై బాలీవుడ్లో మాత్రం న్యూడ్ సీన్స్ చేయడానికి నో అంటున్నాడు. ఇక్కడ అలాంటి చేసినా స్టుపిడ్ సెన్సార్ బోర్డు వాటిని డిలీట్ చేస్తుంది అంటూ తన కోపాన్ని వెల్లగక్కాడు.