కార్పోరేట్ ఆఫీసులో బాస్ లైంగిక వేధింపులు
జిలెట్ నో షేవ్ నో లిప్‌స్టిక్ ప్రచార కార్యక్రమం కోసం ఢిల్లీ వచ్చిన ప్రముఖ హీరోయిన్ చిత్రాంగద తాను త్వరలో నటించనున్న కొత్త సినిమాలను మీడియాకు తెలిపింది. అర్జున్ రాంపాల్ హీరోగా, చిత్రాంగద హీరోయిన్‌గా రూపొందిస్తున్న సినిమా 'ఇన్ కార్'. ఈసినిమాలో చిత్రాంగద కార్పోరేట్ ఆఫీసులో బాస్ లైంగిక వేధింపులకు గురయ్యే ఉద్యోగిని పాత్రలో నటించింది. ఈ సినిమాని చిత్రాంగదకు ఎంతో సన్నిహితుడైన సుధీర్ మిశ్రాయే దర్శకత్వం వహించాడు.
దీనితో పాటు చిత్రాంగద జోకర్ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నర్తించింది. ఈ పాట షూటింగ్ చాలా బాగా జరిగిందని, ఫరాఖాన్ చక్కటి కొరియోగ్రఫీని అందజేసిందని ప్రశంసించింది. ఇన్ కార్ సినిమా గురించి చిత్రాంగద మాట్లాడుతూ గత సినిమాల్లాగే ఇదీ అధ్బుతమైన స్క్రిప్టు. లైంగిక వేధింపులకు సంబంధించిన ప్రేమ కధగా అభివర్ణించింది.
ఇక చిత్రాంగద హజారే క్వాహిషే వంటి సినిమాల్లో సీరియస్ పాత్రల్లో నటించి మెప్పించింది. దేసీబాయ్జ్‌లో మాత్రం గ్లామరస్‌గా కనిపించింది. తాను అన్ని రకాల పాత్రలు చేయగలనన్న నమ్మకాన్ని దేసీబాయ్జ్ కలిగించిందని తెలిపింది. 'అన్నింటికంటే ప్రేక్షకుల స్పందనే ముఖ్యం. దేసీబాయ్జ్‌లో నా పాత్రకు మంచి ఆదరణ కనిపించింది. ఇలా అన్ని రకాల పాత్రలు రావడం ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పింది. ఐ, మీ ఔర్ తుమ్‌లో బాలీవుడ్ అందగాడు జాన్ అబ్రహంతో కలిసి మరోసారి కనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











