twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాటెస్ట్ స్టార్ హీరో ఐటం సాంగ్

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాటెస్ట్ స్టార్ హీరో జాన్ అబ్రహం త్వరలో ఐటం సాంగులో మెరవనున్నాడు. ఇన్నేళ్ల తన కెరీర్లో ఇప్పటి వరకు ఐటం సాంగు చేయని జాన్ తొలిసారిగా ఈ ఫీట్ చేయబోతున్నాడు. 'విక్కీ డోనోర్' అనే చిత్రానికి గాను జాన్ ఈఫీట్ చేస్తున్నాడు. గతంలో దోస్తానా చిత్రంలో కత్తిలాంటి కండల బాడీతో అమ్మాయిల మనుసునే కాకుండా అబ్బాయిలను కూడా ప్లాట్ చేసిన ఈ హాండ్సమ్.....ఈ చిత్రంలో అంతకు మించిన ఎక్స్ ఫోజింగ్ తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. డిల్లీ బెల్లీ సినిమాలో ఐటం సాంగు చేసిన అగ్రహీరో 'అమీర్ ఖాన్'ను ఆదర్శంగా తీసుకున్న జాన్.....ఈ ఐటం నెంబర్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు తన మాజీ లవ్వర్ బిపాసా బసు ఐటం సాంగులతో షేక్ చేస్తుంటే....జాన్ ఆమెకు పోటీగా తయారవుతాడేమో...? అని చర్చించుకుంటున్నారు బాలీవుడ్ జనాలు.

    ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏమిటంటే ఈ సినిమా ద్వారా తొలిసారిగా జాన్ అబ్రహం నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. 'జాన్ అబ్రహం ఎంటర్ టైన్మెంట్' బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మాణం అవుతోంది. ఈ చిత్రానికి సుజిత్ సర్కార్ దర్శకత్వం వహిస్తుండగా ఆయుష్మాన్ ఖుర్రానా, యామి గౌతం, అను కపూర్ ముఖ్య తారగణంగా నటిస్తున్నాడు. మే 11న ఈచిత్రాన్ని విడుదల చేసేదుకు సన్నాహాలు చేస్తున్నారు.

    ఇక జాన్ అబ్రహం వ్యక్తి గత విషయాలకొస్తే...గత కొన్నేళ్లుగా బిపాసా బసుతో డేటింగ్ చేసిన ఈ హీరో ఇటీవల ఆమెతో విబేధాలు వచ్చి విడిపోయాడు. తాజాగా ప్రియా అనే మరో అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట.

    English summary
    John Abraham, who has never done an item number so far in his career, will for the first time in his acting career shake a leg in his first production venture titled Vicky Donor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X