కొత్త ప్రియురాలితో జాన్ అబ్రహం హల్‌చల్
బిపాషా బసుతో 10 సంవత్సరాల సహజీవనం తర్వాత ఆమెతో విడిపోయిన బాలీవుడ్ హాటెస్ట్ బ్యాచిలర్ జాన్ అబ్రహం గత కొంత కాలంగా ఒంటరిగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే జాన్ ఇప్పడు ఒంటరి వాడు కాదు. బిపాసతో విడిపోయిన తర్వాత ఆడ తోడు లేకుండా సతమతం అవతున్న ఈ హీరో తాజాగా కొత్త గర్ల్ ఫ్రెండ్ ను వెతుకున్నాడు. అంతేకాదు ఆమె తన కొత్త గర్ల్ ఫ్రెండ్ అని ప్రపంచానికి తెలిసేలా ఇటీవల జరిగి ఓ కార్యక్రమంలో ఆమెతో చెట్టా పట్టాలేసుకుని ఎంట్రీ ఇచ్చి హల్ చల్ చేశాడు.
ఆవిడ పేరు ప్రియా మార్వా. జాన్ వృత్తి సినిమాల్లో నటించడం అయితే, ప్రియా మార్వా ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ప్రియా మార్వాతో 'సం"బంధం ఏర్పడిన తర్వాతే జాన్ తన మాజీ లవ్వర్ బిపాస బసుతో విడిపోయారని అంటున్నారు. అంతే కాదు జాన్ అబ్రహం, ప్రియా పెళ్లి చేసుకోబుతున్నారని, త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్.
జాన్ సంగతి ఇలా ఉంటే...ఆయన మాజీ లవ్వర్ బిపాస తెలుగు హీరో రాణా దగ్గుబాటితో ప్రేమలో పడిందనే, ఇద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లిందని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











