జరిగిందేదో జరిగిపోయింది: జెనిలియా
రామ్ చరణ్ తో చేసిన ఆరెంజ్ ప్లాప్ అయిన తర్వాత నుంచి జెనిలియాకు వరస వివాదాలు చుట్టుకుంటూనే ఉన్నాయి.తాజాగా ఆమె 'ఫోర్స్' సినిమాలో పెళ్ళి సీనుతో మరో వివాదంలో పడింది. తెలుగులో వచ్చిన 'ఘర్షణ' చిత్రానికి ఈ సినిమా రీమేక్. జాన్అబ్రహం, జెనీలియా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పెళ్ళితంతు సీను తీసేటప్పుడు పండితులు పెళ్ళిమంత్రాలకు బదులుగా నిజమైన మంత్రాలు చదివి పెళ్ళి తంతును కాని చ్చేశారని వార్త మొదలైంది.ఇటీవల ఈ చిత్రం షూటింగ్‌కోసం జైపూర్‌కి వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్టులో మీడియావారు ఇదే విషయం ప్రస్దావించారు.
దాంతో సీరియస్ అయిన జెనీలియా.. జరిగిందేదో జరిగిపోయింది.పదే పదే ఆ విషయాన్ని ఎందుకు గుర్తుకు చేస్తారు. దానిపై నేనేమీ స్పందించను అంటూ సీరియస్ గా వెళ్ళిపోయింది జెన్నీ.దాంతో ఇదే విషయాన్ని ఆ చిత్రం హీరో జాన్ అబ్రహంని అడిగినా అతడు ఇదే సమాధానమిచ్చి తప్పుకున్నాడు. అయితే బాలీవుడ్ లో మరో కథనం కూడా ప్రచారంలో ఉంది.జెనీలియా చేసేదంతా డ్రామా అని,కావాలనే ఈ రూమర్ ని క్రియేట్ చేసిందని.ఎందుకూ అంటే రితేష్‌దేశ్‌ముఖ్‌తో జెనీలియా ప్రేమ వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అవ్వటంతో దాన్ని ఏమార్చటానికి ఈ సీన్ క్రియేట్ చేసిందని చెప్పుకుంటున్నారు.ప్రస్తుతం జెనీలియా తెలుగులో రానా సరసన నా ఇష్టం చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











