బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు 15 రోజుల జైలు, బెయిల్
బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహంకు ముంబై కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో పాటు జాన్ అబ్రహం వేసిన రివ్యూ పిటీషన్‌ను కూడా కోర్టు కొట్టి వేసింది. బెయిల్ కోసం జాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2006లో రాష్ డ్రైవింగ్ చేసిన కేసులో కోర్టు అతనికి ఈ శిక్ష ఖరారు చేసింది. జాన్ తన స్పోర్ట్స్ బైక్‌పై అతి వేగంగా వెలుతూ 2006 ఏప్రిల్ లో రాత్రి 11 గంటలకు ఖార్ దండా రోడ్ లో ఇద్దరిని తీవ్రంగా గాయ పరిచాడు. ఈ కేసులో ఈ రోజు విచారణకు వచ్చింది. బాంద్రా అడిషనల్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఈ కేసులో ఆయనకు రూ. 1500 జరిమాన కూడా విధించారు.


Click it and Unblock the Notifications











