ప్రియురాలిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ప్రియా రాంచల్ అనే అమ్మాయితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ వృత్తి సినిమాల్లో నటించడం అయితే, ప్రియా రాంచల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. గతంలోనే వీరి పెళ్లయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అఫీషియల్‌గా మాత్రం వెల్లడి కాలేదు. తాజాగా జాన్ అబ్రహం పెళ్ల విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్‌గా లీక్ చేసాడు. 'ఈ కొత్త సంవత్సరంలో మాకు మీ ఆశీస్సులు, ప్రేమ దక్కాలని కోరుకుంటున్నాము....ప్రేమతో, జాన్-ప్రియా అబ్రహం' అంటూ ట్వీట్ చేసాడు.

"Wishing you and your loved ones a blessed 2014! May this year bring you love, good fortune and joy. Love, John and Priya Abraham." అంటూ జాన్ అబ్రహం తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

గతంలో వీరి వివాహం లాస్ ఏంజిల్స్‌లో జరిగినట్లు వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో ఈ వార్తలపై మండి పడ్డ జాన్....తాను సింగిల్‌గానే ఉన్నానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. మరి పెళ్లి ఎప్పుడు జరిగిందో? ఏమో? తెలియదు కానీ...మొత్తానికి ఇంతకాలం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన జాన్...ఎట్టేకేలకు ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బయటకు వెల్లడించడం విశేషం.

2013లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.....జాన్ అబ్రహం అదే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఎప్పుడు చేసుకుంటాననే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 10 మంది సన్నిహితులను మాత్రమే మా పెళ్లికి ఆహ్వానిస్తాను అని మాత్రం వెల్లడించాడు. అప్పుడు చెప్పినట్లుగానే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని....ట్విట్టర్ ద్వారా ఇపుడు ఆ విషయాన్ని బయట పెట్టాడు.

జాన్ అబ్రహం, ప్రియా రాంచల్ మధ్య పరిచయం ముంబై బాంద్రలోని ఓ జిమ్‌లో ఏర్పడిందని తెలుస్తోంది. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా, ఆపై పెళ్లికి దారి తీసింది. ప్రియా రాంచల్‌ను పెళ్లాడటానికి ముందు బిపాసా బసుతో జాన్ అబ్రహం లాంగ్ టైమ్ ప్రేమాయనం కొనసాగించిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X