న్యూడ్ సీన్స్ చేస్తానంటున్న స్టార్ హీరో
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం అభిమానులకు ఒక గుడ్ న్యూస్. త్వరలో ఈ హీరో హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. హాలీవుడ్ ఎంట్రీ అనగానే సెన్సేషన్ సీన్స్ చేయడానికి రెడీ అంటున్నాడు జాన్. హాలీవుడ్‌లో స్క్రిప్టు డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి రెడీ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు.
తనకు న్యూడ్ సీన్స్ చేయడం కొత్తేమీ కాదని, ఇప్పటికే బాలీవుడ్లో చేసానని... అయితే సెన్సార్ బోర్డు వాటిని అనుమతించ లేదని చెప్పుకొచ్చాడు. హాలీవుడ్లో అయితే ఇలాంటి సమస్యలు ఉండవని, బేషుగ్గా న్యూడ్ సీన్స్ చేయడానికి ఒప్పుకుంటానని అంటున్నాడు. అయితే ఇకపై బాలీవుడ్లో మాత్రం న్యూడ్ సీన్స్ చేయడానికి నో అంటున్నాడు. ఇక్కడ అలాంటి చేసినా స్టుపిడ్ సెన్సార్ బోర్డు వాటిని డిలీట్ చేస్తుంది అంటూ తన కోపాన్ని వెల్లగక్కాడు.
జాన్ అబ్రహం లాంటి కత్రిలాంటి హీరోను నగ్నంగా చూడాలని ఆయన లేడీ అభిమానులు ఎప్పుటి నుంచో ఆశ పడుతున్నారు. మరి జాన్ అబ్రహం హాలీవుడ్ ఎంట్రీ తోనైనా జాన్ అబ్రహం లేడీ ఫ్యాన్స్ కోరిక తీరుతుందని ఆశిస్తున్నారు. ఆయన నటించబోయే హాలీవుడ్ మూవీ వివరాలు త్వరలో తెలియనున్నాయి.
జాన్ పర్సనల్ లైఫ్ లోకి వెళితే...
బిపాసాతో విడిపోయిన తర్వాత జాన్ అబ్రహం ప్రియా అనే అమ్మాయితో ప్రేమాయణం మొదలు పెట్టాడు. ఆమె సినీ రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాకింగ్ రంగానికి చెందిన ధనవంతుల కుమార్తె. బిపాసా కుళ్లుకోవాలనే జాన్ ఆమెతో ఎఫైర్ మొదలు పెట్టారనే వాదన కూడా ఉంది. జాన్ అబ్రహం-ప్రియా రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆ మధ్య పుకార్లు షికార్లు చేసాయి.


Click it and Unblock the Notifications











