ఆ హీరో వీర్య కణాలకు మహా డిమాండ్!
మాంచి హైట్, కండలు తిరిగిన బాడీ, చూడ చక్కని రూపంతో బాలీవుడ్ తెరపై స్టార్ హీరోగా రాణిస్తున్న జాన్ అబ్రహం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బిపాసాతో ప్రేమాయణం సాగిస్తూ ఆ మధ్య తరచూ వార్తలో నిలిచిన ఈ హీరో కొన్ని రోజుల క్రితమే ఆమెతో విడిపోయి ప్రియా అనే మరో భామతో లవ్ మొదలు పెట్టాడు.
తాజాగా జాన్ అబ్రహంకు సంబంధించిన ఓ విషయం బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. తను నిర్మిస్తున్న సినిమా ప్రమోషన్లో భాగంగా వీర్య కణాలను దానం చేయాలని ఈ యాక్టర్ నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి సంతాన భాగ్యం లేని చాలా మంది దంపతులు జాన్ వీర్య కణాల కోసం ప్రయత్నిస్తున్నారు.
జాన్ అబ్రహం 'వికీ డోనర్' అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హోమో సెక్సువాలిటీ, వీర్యకణాల దానం అనే అంశంతో ముడి పడి ఈ సినిమా సాగుతుంది. ఆయుష్ మాన్ ఖురానా, యామీ గౌతం, అను కపూర్ ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అవుతుండగా, సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవల ఓ ప్రెస్ మీట్లో ఈ చిత్ర దర్శకుడు సుజిత్ సిర్కార్ మాట్లాడుతూ...జాన్ వీర్య కణాలకు బాగా డిమాండ్ ఉందని, చాలా మంది క్లయింట్స్ ఆయన వీర్యకణాలనే కావాలని అడుతున్నారని డాక్టర్స్ చెప్పినట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











