twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా వీర్యం దానం చేస్తా...కానీ నాపోలికలొస్తే ఎలా?

    By Bojja Kumar
    |

    వీర్య దానం, అద్దెగర్భం గురించి చర్చించే కాన్సెప్టుతో రూపొందుతున్న చిత్రం 'వికీ డోనర్'. జాన్ అబ్రం నిర్మిస్తున్న ఈచిత్రం ద్వారా ఆయుష్ మాన్ ఖురానా, యామీ గౌతం, అను కపూర్ ఈ చిత్రం ద్వారా వెండి తెరకు పరిచయం అవుతుండగా, సుజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నిన్న(ఏప్రిల్ 20) విడుదలైంది.

    ఈ సినిమా చూసిన మహిళ ప్రేక్షకులు జాన్ అబ్రహంను వీర్యం ఇవ్వాలని కోరుతున్నారట. దీనిపై జాన్ స్పందిస్తూ.....'వీర్య దాతల పేర్లు రహస్యంగా ఉండాలి, మంచి జరుగుతుందంటే నేనూ చేస్తా, ఎవరైనా పిల్లలు నా పోలికలతో ఉంటే ఆ మహిళకు నేను వీర్యం ఇచ్చినట్లు తెలిసి పోతుంది. ఆ తర్వాత కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు, అందుకే నాకు కాబోయే భార్యకు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను' అని చెప్పుకొచ్చాడు.

    ఈ చితంలో మీరు ఎందుకు నటించలేదు అని మీడియా అడిగిన ప్రశ్నకు జాన్ స్పందిస్తూ....సినిమా స్క్రిప్టు ప్రకారం కొత్తవాళ్లతో అయితేనే బాగుటుందని భావించా, నా తొలి చిత్రం 'జిస్మ్' చిత్రం కంటే ముందు ఈ సినిమా వచ్చి ఉంటే తప్పకుండా నటించే వాన్ని అని స్పష్టం చేశాడు. ఈ చిత్రం చూసిన వారు వీర్య దానం గురించి పాజిటివ్ వేలో ఆలోచిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

    రూ. 20 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం తొలి రోజు 1.5 కోట్ల వసూళ్లూ సాధించింది. ఈ చిత్రానికి జుహి చతుర్వేది కథను అందించారు. జాన్ అబ్రహం ఎంటర్ టైన్మెంట్స్, ఈరోస్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి.

    English summary
    The thing is that John is not particularly thrilled about the idea of designer babies and he doesn’t think it’s flattering when to-be parents demand to have a child who looks like him. Mr Abraham is now pretty clear that his genes will be reserved for himself and his own family. “If I have to donate sperm then I would like to donate it to my future wife,” he said flatly.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X