»   »  జాన్ అప్పారావ్ కు భలే గిరాకీ!!!

జాన్ అప్పారావ్ కు భలే గిరాకీ!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
జాన్ అప్పారావ్ కు 40 ప్లస్ అయినా గిరాకీ బాగానే ఉంది. కెరీర్ డెవలప్ మెంట్ లో పడి పెళ్లి విషయాన్ని మరిచిపోయినా జాన్ అప్పారావ్ కు డిమాండ్ బాగానే ఉంది. అందుకే ఈ అప్పారావ్ విదేశీ ప్రదర్శన, డివిడి హక్కులను బే-మూవీస్ అండ్ కొత్త సినిమా సంస్థ చేజిక్కించుకుంది.
వెంకట్ కూచిపుడి రూపొందిస్తున్న జాన్ అప్పారావ్ 40 ప్లస్ సినిమాలో జాన్ అప్పారావ్ గా కృష్ణ భగవాన్ చేస్తుండగా హీరోయిన్ లుగా సిమ్రాన్, రుతికలు చేస్తున్నారు. ఈ సినిమా హాస్యం ప్రధానాంశంగా రూపొందుతోంది. ఈ చిత్ర ఆడియోను డిసెంబర్ రెండో వారంలో విడుదల చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X