జాన్ అబ్రహాంను ఆల్ మోస్ట్ చంపేసాడు!
ముంబై: బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం తృటిలో అనిల్ కపూర్ చేతిలో చావు నుంచి తప్పించుకున్నాడు. ఇదేదో సినిమా స్టోరీ కాదు. రియల్ సంఘటన. బాలీవుడ్ మూవీ 'షూటౌట్ ఎట్ వాడాలా' సెట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ చిత్రంలో జాన్ అబ్రహం గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తుండగా, అనిల్ కపూర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు.
సినిమా షూటింగుల్లో గన్లలో ప్రత్యేకంగా తయారు చేసిన డమ్మీ బుల్లెట్లు(జీరో మెటాలిక్ లీడ్ బుల్లెట్స్) వాడతారు. అవి ఫైర్ అయినప్పుడు రియల్ గన్ ఫైర్ అయినట్లు కనిపిస్తుంది. అయితే వాటిని 15 ఫీట్ల దూరం నుంచి పేల్చితే ఏమీ కాదు. కానీ అనుకోకుండా అనిల్ కపూర్ దగ్గర నుంచి ఫైర్ చేసాడు. అయితే మిస్ ఫైర్ కావడంతో జాన్ అబ్రహం స్వల్ప గాయంతో బయట పడ్డాడు. ఈ సంఘటనతో యూనిట్ సభ్యులు మొత్తం షాక్ అయ్యారు. అతని మెడకు తీవ్ర గాయాలయ్యేవని, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉందని యూనిట్ సభ్యులు తెలిపారు.
ఈ సంఘటనపై అనిల్ కపూర్ దీనిపై స్పందిస్తూ...ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. కానీ జాన్ ఆ సంఘటనను స్పోర్టివ్‌గా తీసుకున్నాడని వెల్లడించారు. జాన్ అబ్రహం స్పందిస్తూ నేను ఈ రోజు బ్రతికున్నానంటే నిజంగా నమ్మకలేక పోతేన్నాను అని వ్యాఖ్యానించారు. 1993లో కుంగ్ ఫూ ఐకాన్, హాలీవుడ్ స్టార్ బ్రూస్లీ తనయుడు బ్రాడ్ సన్ ఇలాంటి సంఘటనలోనే మరణించిన నేపథ్యంలో తాజా సంఘటన సర్వత్రా చర్చనీయాంశం అయింది.
'షూటౌట్ ఎట్ వడాలా' చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్తా కపూర్, సంజయ్ గుప్తా, శోభా కపూర్ సంయుక్తంగా బాలాజీ టెలి ఫిలింస్, వైట్ ఫీచర్ ఫిలింస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, జాన్ అబ్రహం, కంగన రనౌత్, తుషార్ కపూర్, సోనూసూద్ ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రీతమ్, విశాల్ శేఖర్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











