రెమ్యునేషన్ లో ఫస్ట్ ప్లేస్ ఆ స్టార్ హీరోదే..
హాలీవుడ్ లో అత్యధిక పారితోషికాన్ని ఆర్జించిన నటుడిగా సూపర్‌స్టార్ జానీ డెప్ అగ్రస్థానంలో నిలిచారు. 'ఫోర్బ్స్' ప్రకటించిన తాజా జాబితాలో జానీడెప్ ప్రధమ స్థానాన్ని దక్కించుకున్నారు. 2009-2010 సంవత్సరంలో జానీడెప్ దాదాపు రూ.240 కోట్లను ఆర్జించారు. జూన్ 2009 నుంచి 2010 జూన్‌తో పరిసమాప్తమైన సంవత్సర కాలంలో ఇది ఆయన సంపాదించిన మొత్తమని ఫోర్బ్స్ పేర్కొంది. 'ఆలిస్ ఇన్ వండర్‌ల్యాండ్' చిత్రంలో జాన్‌డెప్ పోషించిన పాత్ర ఆయనను అత్యున్నత స్థానంలో నిలిపింది. ఇక, ద్వితీయస్థానంలో మరో నటుడు బెన్‌స్టిల్లర్ నిలిచారు. తృతీయస్థానం టామ్‌హ్యాంక్స్‌కు లభించింది. మరి మన తెలుగులో ఎక్కువ రెమ్యునేషన్ ఎవరు తీసుకుంటున్నారంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఇంతకుముందు చిరంజీవి ఉండేవారు. అలాగే హీరోయిన్స్ లో ఇలియానా, త్రిష టాప్ ప్లేస్ లో ఉన్నారు.
హాలీవుడ్ జానీ డెప్ ఆలిస్ ఇన్ వండర్ ల్యాండ్ బెన్ స్టిల్లర్ టామ్ హ్యాంక్స్ hollywood johnny depp alice in wonder world


Click it and Unblock the Notifications