మనోజ్ హీరోయిన్ జానీ గద్దర్‌తో...
వేదం సినిమాలో హీరో మనోజ్ ప్రియురాలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? ఆ విడ పేరు లేఖా వాషింగ్టన్. వేదం తర్వాత ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించకుండా పోయినా ఓ బాలీవుడ్ రీమేక్‌తో మళ్లీ తెలుగులో కనిపించబోతోంది. బాలీవుడ్‌లో శ్రీరామ్ రాఘవన్ దర్వకత్వంలో నీల్ నితిన్ ముఖేష్ నటించిన 'జానీ గద్దర్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హైదరాబాద్ నవాబ్స్, నిన్న నేడు రేపు చిత్రాల దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్న దర్శకత్వం వహిస్తున్నాడు.
90స్‌లో హీరోయిన్‌గా పాపులర్ అయిన ఇంద్రజ ఈ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. కుబేర సినిమాస్ పతాకంపై దీపక్ బల్దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఓ ఏసీ రైలు బోగీ సెట్‌ను నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రిషి అర్మాండా, సాయికుమార్, బ్రహ్మజీ, ఆశిష్ విధ్యార్థి, రూబీ పరిహార్, సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు లీసుకు రావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన జానీ గద్దర్ సినిమా హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మరి తెలుగులో ఈ సినిమా పరిస్థితి ఏమిటో విడుదలైతే గానీ తెలీదు.


Click it and Unblock the Notifications











