అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌కు జానీ మూవీ కనెక్షన్.. పవన్ కల్యాణ్ చేతి కర్చీఫ్ వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో దర్శకుడు సాగర్ చంద్ర రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతున్నది. మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన అయప్పనుమ్ కోషియయ్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు జానీ మూవీకి కనెక్షన్ సంబంధించిన బయటకు రావడం ఆసక్తిని కలిగించింది. ఆ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్
హైదరాబాద్‌లో అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న షూటింగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పాల్గొన్నారు. వీరిద్దరి సినిమాలో కీలకంగా మారిన యాక్షన్ సన్నివేశాలను దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగు గ్యాప్‌లో పవన్ కల్యాణ్ పలువురిని కలిశారు.

ఏఎం రత్నంకు శుభాకాంక్షలు
గురువారం పవన్ కల్యాణ్ కలిసిన వారిలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నంతోపాటు పలువురు అభిమానులు కూడా ఉన్నారు. తనను కలిసిన ఏఎం రత్నంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్బంగా తీసిన ఫోటోలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి.

ఫ్యాన్స్‌తో దిగిన ఫోటోలు వైరల్
ఇదిలా ఉండగా, అయ్యప్పనుమ్ కోషియమ్ షూటింగు నేపథ్యంలో గురువారం పవన్ కల్యాణ్ తన సన్నిహితులు, స్నేహితులు, అభిమానులతో దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ ఫోటోలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పవర్ స్టార్ తన చేతికి జానీ సినిమా టైటిల్‌ను ముద్రించిన కర్చీఫ్‌ను ధరించి ఉండటం అభిమానులను విశేషంగా ఉంది. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పవన్ కల్యాణ్ చేతికి జానీ కర్చీఫ్
2003లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ రూపొందించిన జానీ సినిమాకు పవన్ కల్యాణ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను ముద్రించిన కర్చీఫ్‌ను ఎందుకు ధరించారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు ఏదైనా కనెక్షన్ ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

పవన్ కల్యాణ్ కోసం త్రివిక్రమ్ మాటలు
అయ్యప్పనుమ్ కోషియం సినిమాను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారని తెలిసింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరేళ్ల సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











