ఎన్నికల్లో నిలబడ్డ హాట్ ఐటంబాబ్...రిజల్ట్
ముంబై : అసోసియేషన్ ఎన్నికల్లో స్టార్ ఐటం గర్ల్ రాఖీసావంత్ పోటీపడుతోంది. చలనచిత్ర రంగంలో మార్పులు తీసుకువచ్చేందుకు తాను సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) 2013 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఆమెపై కమిడియన్ జానీ లివర్ నిలబడి విజయం సాధించారు.
ప్రతి రెండేళ్లకొకసారి సినీ అండ్ టివి ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతాయి. కళాకారులకు సరైన గుర్తింపు రావడంలేదని, పలువురు కళాకారులకు సకాలంలో డబ్బులు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు.
ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకే తాను ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు విలేకరుల సమావేశంలో రాఖీసావంత్ పేర్కొన్నారు. ప్రస్తుత వ్యవస్థలో సమూలంగా మార్పులు తెచ్చేందుకే తాను పోటీచేసి విజయం సాదిస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు. అయితే ఆమె సెకండ్ ప్లేస్ లో నిలిచారు.
జానీ లివర్ కి 839 ఓట్లు వస్తే...రాఖీ సావంత్ కి 734 ఓట్లు వచ్చాయి. రాఖీ జనరల్ సెక్రటరి అవుతుంది. అలాగే జానీకి చెందిన మాగ్జిమమ్ మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటికి ఎంపికయ్యారు.


Click it and Unblock the Notifications












