మహేష్ ఉచ్చ డైలాగుపై మరో కుళ్ళు జోక్
మహేష్ తాజాగా ది బిజినెస్ మ్యాన్ చిత్రం కోసం ముంబై ని ఉచ్చ పోయించటానికి వచ్చాను అనే డైలాగు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ డైలాగుతో ఓ ప్రోమో విడుదల చేసారు. దాన్ని ఫేస్ బుక్ లో సెటైర్ చేస్తూ..నువ్వు పోయించకపోతే ఎవడు పోసుకోడా ఏంటి రా జప్పా అంటూ ఫన్ చేసారు. ఇప్పుడది ఫేస్ బుక్ లో బాగా ప్రచారం అవుతోంది. ఈ డైలాగు సర్వత్రా విమర్శలు పాలవుతోంది. అయితే మహేష్ అభిమానులు మాత్రం ఈ డైలాగు మహేష్ లోని ఫైర్ ని చెప్తోందంటున్నారు. ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.ఈ విషయమై పూరీ మాట్లాడుతూ...తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు. అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు.
అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే. అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను.కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











