»   » నవ్వులే నవ్వులు: 'బాహుబలి'పై సెటైర్స్, జోక్స్ (వీడియోలు)

నవ్వులే నవ్వులు: 'బాహుబలి'పై సెటైర్స్, జోక్స్ (వీడియోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'బాహుబలి' ఆడియో వేడుక నిన్న తిరుపతిలో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. అదే స్పీడులో తమ సినిమాపై జోకులేసుకొంది 'బాహుబలి' టీమ్‌. ఆ జోక్స్ ని అందరూ ఎంజాయ్ చేసారు. తెగ నవ్వుకున్నారు. ఇలా ఆడియో ఫంక్షన్ లో జోక్స్ వేయటం గొప్ప విషయమే.

'బొమ్మరిల్లు'లో'అంతా మీరే చేశారు నాన్నా..' సీన్‌నీ స్ఫూఫ్‌గా మార్చుకొన్నారు. ఈ సన్నివేశంలో ప్రకాష్‌రాజ్‌ రాజమౌళి అన్నమాట. సిద్ధార్థ్‌.. ప్రభాస్‌కి అభిమాని. 'ఇప్పటికీ మీరు 'బాహుబలి' రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు సార్‌...' అంటూ రాజమౌళిని ప్రభాస్‌ ఫ్యాన్‌ నిలదీయడంతో.. రాజమౌళితో సహా.. అక్కడున్నవాళ్లంతా హాయిగా నవ్వేశారు. ఆ వీడియో మీరూ చూడండి...


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఆ జోక్స్ ...'కిక్‌' సినిమాలో ఓ సన్నివేశాన్ని 'బాహుబలి' టీమ్‌ సరదాగా వాడుకొంటూ నవ్వులు పూయించింది. రాజమౌళి ఫొటో చూసిస్తూ 'ఐ యామ్‌ లి.. రాజమౌళి. బాహుబలిని ఎప్పుడు రిలీజ్‌ చేస్తానో నాకే తెలీదు..' అంటూ నవ్వించారు.అలాగే... 'అవతార్‌'లోని సన్నివేశాలకు 'బాహుబలి' ప్రచార చిత్రంలోని సంభాషణలను జతచేసి చూపించిన ట్రైలర్‌ ఆకట్టుకొంది.దీనితో పాటు..


'బాహుబలి' మొదలయ్యాక మూడు ఐపీఎల్‌లు జరిగాయి, ఓ వరల్డ్‌కప్‌ సిరీస్‌ పూర్తయ్యింది, 'బాహుబలి'తో పాటు మొదలైన హైదరాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టు కూడా పూర్తికావొచ్చింది కానీ 'బాహుబలి' పూర్తికాలేదంటూ.. సెటైర్లు వేసుకొన్నారు.


ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


Jokes on Rajamouli's Baahubali Movie

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Here is The Spoof Version of Baahubali with Bommarillu Moive Climax Scene by Baahubali Team. Also Watch Baahubali Trailer in Avatar Version Watch and Share Baahubali Bommarillu Awesome Spoof.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu