ఐశ్వర్యరాయ్ విడగొడితే...మోడీ కలిపారు!
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ చాలా కాలం తర్వాత ఒకే కార్యక్రమంలో కలిసి కనిపించారు. సోమవారం జరిగిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా వీరిద్దరు హాజరయ్యారు. ఒకప్పుడు వీరి మధ్య మంచి స్నేహ బంధమే ఉండేది. అయితే ఐశ్వర్యరాయ్ కారణంగా ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు.
గతంలో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సల్మాన్‌తో గొడవ పడి విడిపోయిన ఐశ్వర్యరాయ్...సల్మాన్ ఖాన్ తనను శారీరకంగా హింసించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్‌తో ప్రేమాయణం మొదలు పెట్టింది ఐశ్వర్యరాయ్.

ఓసారి వివేక్ ఒబెరాయ్ కూడా సల్మాన్ ఖాన్‌పై సంచలన ఆరోపణలు చేసారు. సల్మాన్ తనను బెదిరిస్తున్నాడని, అతని నుండి 41 మిస్డ్ కాల్స్ వచ్చాయని అన్నారు. ఈ పరిణామంతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఆ తర్వాత వివేక్ ఒబెరాయ్ సల్మాన్ ఖాన్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నించినా.....సల్మాన్ ఖాన్ మాత్రం అతన్ని దూరం పెడుతూ వచ్చాడు.
అప్పటి నుండి ఇద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో కలిసి కనిపించిన సందర్బాలు లేవు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావడంతో......ఐశ్వర్యరాయ్ మూలంగా విడిపోయిన ఈ స్టార్స్, నరేంద్ర మోడీ మూలంగా మళ్లీ కలిసారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


Click it and Unblock the Notifications











