'మోహన్ బాబునే తప్పు పడతావా?' అంటూ వార్నింగ్
ఆ బెదిరింపు ఇలా సాగింది... 'ఏం మోహన్ బాబునే తప్పు పడతావా... ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడతావా... ఈ సాయింత్రం ఆరు గంటలకు నీ ఇంటికి వచ్చి నీ మీద దాడి చేస్తాం.. ఆ సమయంలో మీ ఇంటిలో అందరూ ఉంటారు కదా... నీ బర్ర బద్దలు కొడతాం' అంటూ సాగింది. ఈ విధంగా మోహన్ బాబు అభిమానులమంటూ ఆయన్ను బెదిరించారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రముఖ గేయ రచయిత. అలాగే తనకు ఈ విధమైన బెదిరింపులు ఓ నంబరు నుంచి వచ్చాయని, అసబ్యంగా మాట్లాడారని ఆ ఫోన్ నెంబర్ జొన్నవిత్తుల తెలిపారు.
మరో ప్రక్క దేనికైనా రెడీ, ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం సినిమాలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న బ్రాహ్మణులకు షాకింగ్ న్యూస్. ఈ రెండు సినిమాల్లోని అభ్యంతరాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు ఓకే చేసిన తర్వాత మళ్లీ కమిటీలు ఎందుకని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రభుత్వం కమిటీ వేయడంపై ఈ చిత్ర నిర్మాత మోహన్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.... కమిటీకి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చాక ప్రభుత్వ జోక్యం సరికాదని మోహన్ బాబు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎ ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం నిర్మాత కూడా ఇదే విధమైన పిటీషన్ వేసారు. ఈ రెండు పిటీషన్ల నేపథ్యంలో..... తాజాగా శుక్రవారం హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.


Click it and Unblock the Notifications












