బయోపిక్‌తో బండారం బయటపెడతా .. నీ బతుకెంతా.. ఆర్జీవీపై జొన్నవిత్తుల ఫైర్
రామ్ గోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ మరో కొత్త బాంబును వదిలిన సంగతి తెలిసిందే. దీపావళి రోజున విడుదల చేసిన ట్రైలర్ ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్న ట్రైలర్ ఇంకా దూసుకుపోతోంది. ఈ మూవీ ట్రైలర్ పెట్టిన చిచ్చు పెరుగుతూనే ఉంది. రీసెంట్‌గా ఓ చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ చేసిన కామెంట్స్ మరింత వేడిక్కిస్తున్నాయి.
ప్రముఖ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మ్యాటర్లోకి రావడంతో వివాదం మరింత పెరిగింది. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా సదరు యాంకర్ జొన్నవిత్తులను కోరగా.. ఆయను తన శైలిలో సినిమా గురించి చెప్పుకొచ్చాడు. అంతా విన్న యాంకర్.. ఆర్జీవీ అభిప్రాయం చెప్పమని తెలిపింది. అప్పటి వరకు అదంతా పట్టనట్టు సెల్‌ఫోన్ చూస్తు ఉన్న ఆర్జీవీ తానేమీ వినలేదని చెప్పుకొచ్చాడు.

జొన్నవిత్తుల ఫైర్..
ఆ మాటతో జొన్నవిత్తుల ఊగిపోయాడు. అంత నిర్లక్ష్యమేంటీ అంటూ వర్మపై ఊగిపోయాడు. ఇంత తెలివి, ఆలోచన ఉండి వాటిని బూడిదలో పోసిన పన్నీరులా చేసేవాడే అసలైన పప్పు.. వర్మ ఒక అంతర్జాతీయ పప్పు.. తనకు చౌదరి అనే బిరుదు ఇచ్చాడని.. దాన్ని తాను స్వీకరిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. తాను కూడా పప్పు వర్మ అంటూ ఓ బిరుదు ఇస్తున్నానని తెలిపాడు.

ఆ చిప్ లేదు..
చాగంటి కోటేశ్వరావు గురించి అమర్యాదగా మాట్లాడిన వర్మపై జొన్నవిత్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను అనుసరించే వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు.. అలాంటి ఆయన్ను అనడానికి నీ బతుకెంత? నీకు సంప్రదాయమనే చిప్ లేదు.. గొప్పవాడివి, మేధావి అని అనుకుంటున్నావ్.. నీ పిశాచ భావజాలంలో ఫిలాసఫర్ అనుకుంటో అనుకో మాకు సంబంధం లేదు.. నీ బురద అంతా ఇళ్లల్లోకి గుళ్లల్లోకి వస్తోంది.. ఖబర్దార్.. నువ్వు ఎందుకు పనికి రావు.. చివరకు నీ మీద సానుభూతి కూడా ఎవ్వరూ చూపించే పరిస్థతి లేదు..జీవశ్చవంలా బతుకుతున్నావ్ అంటూ ఉతికి ఆరేశాడు.

పప్పు వర్మ బయోపిక్..
ఓ ఛార్లీ చాప్లిన్.. హిట్లర్‌ను పేరడీ చేస్తూ గ్రేట్ డిక్టేటర్ ఎలా తీశాడో..మోడ్రన్ టైమ్స్ ఎలా తీశాడో.. ఆ స్థాయిలో రాస్తాను. ఎన్నెన్ని కోణాల్లో ఎంత దుర్మారంగా ఆలోచిస్తావో.. నీ పిచ్చి ఆలోచనలు వెకిలీ సెటైర్లు.. ఎన్ని అనర్థాలకు దారి తీస్తున్నాయో.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యువకులపై దుష్ప్రభావాన్ని చూపుతుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తాను.
Recommended Video

పప్పు అనడానికి వెయ్యి కారణాలు చూపిస్తా..
వర్మను పప్పు అనడానికి వెయ్యి కారణాలు చూపిస్తానని జొన్నవిత్తుల అన్నాడు. ఈ సినిమా ఎవ్వరినీ ఉద్దేశించి తీసింది కాదంటాడు..దమ్ము ధైర్యం ఉంటే మీ గురించే తీశానని చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న వారిని పెట్టి మళ్లీ వారి గురించి సినిమా తీయలేదని అంటున్నావ్.. పిరికిపందవి, దద్దమ్మవి అంటూ ఆర్జీవీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు.


Click it and Unblock the Notifications











