కంగనాపై తిరుగుబాటు.. క్షమాపణ చెప్పకుంటే బహిష్కరిస్తామంటూ వార్నింగ్
వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకున్న ఆమె.. తాజాగా జర్నలిస్టుతో బహిరంగంగానే గొడవకు దిగడం చర్చనీయాంశం అయింది. ఇది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవడంతో కంగనాకు కష్టాలు మొదలయ్యాయి. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. దీంతో ఆమె నటించిన సినిమాకు అడ్డంకులు ఏర్పడేలా ఉన్నాయి.
రెండు రోజుల క్రితం కంగనా తాజా చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలోని సాంగ్ లాంచింగ్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. తన గత చిత్రం 'మణికర్ణిక.. ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' సినిమా రివ్యూ విషయంలో ఓ జర్నలిస్టుతో మాట్లాడే సమయంలో కంగనా విచక్షణ కోల్పోయింది. సదరు జర్నలిస్టుపై విరుచుకుపడిన ఆమె.. ''మణికర్ణిక మేకింగ్ విషయంలో నేనేమైనా తప్పు చేశానా..? జాతీయత గురించి సినిమాతీయడమే నేను చేసిన తప్పా..?'' అంటూ అతడిపై ప్రశ్నల వర్షం కురిపించి ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీంతో కంగనాపై జర్నలిస్టులు తిరుగుబాటుకు దిగారు. దేశ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ కలిపి 'జడ్జిమెంటల్ హై క్యా' యూనిట్‌కు షాక్ ఇచ్చాయి. ఈ వివాదానికి ముగింపు పలకాలంటే కంగనా జర్నలిస్టులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఆమె దీనికి స్పందించకుంటే సినిమా కార్యక్రమాలను బహిష్కరిస్తామంటున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కొందరు జర్నలిస్టులు చిత్ర నిర్మాత ఏక్తాకపూర్‌ను కలిశారు.
ప్రస్తుతం కంగనా చేస్తున్న చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కించారు. మొదటి ఈ సినిమాకు 'మెంటల్ హై క్యా' అని టైటిల్ పెట్టారు. అయితే, దీనిపై సైక్రియార్టిస్టులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టైటిల్ మార్చడంతో పాటు ట్రైలర్‌ను సైతం వాయిదా వేశారు. ఏక్తా కపూర్, శ్రద్ధా కపూర్, శైలేష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కంగనాతో పాటు రాజ్‌కుమార్ రావు, విక్రాంత్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











