'జోష్'కు బాలారిష్టాలు
ప్రముఖ కథానాయకుడు నాగార్జున తనయుడు నాగచైతన్యను కథానాయకుడిగా పరిచయం చేస్తూ వాసు వర్మ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన చిత్రం 'జోష్'. కార్తిక కథానాయికగా పరిచయమౌతోంది. ఈ చిత్రాన్ని మొదట ఆగస్టు రెండో వారంలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేసారు. కానీ 'మగధీర' ప్రభంజనం ముందు నిలబడటం కష్టం అని నాగార్జున పుట్టినరోజున విడుదల చెయ్యాలని భావించారు. కానీ భారీ అంచనాల మధ్య విక్రమ్ నటించిన మల్లన్న చిత్రం విడుదలవుతుండటం, అందులోనూ 'దిల్' రాజే ఈ చిత్రం విడుదల చెయ్యడంతో తన చిత్రాల మధ్యన పోటీ ఎందుకు అనుకున్నారో, లేక ఓపెనింగ్స్ తగ్గుతాయనో ఈ చిత్రాన్ని సెపెంబరు 3న విడుదల చెయ్యాలనుకున్నారు.
కానీ సెపెంబరు 2న జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మృతి చెందటంతో ఈ చిత్రం విడుదల మరో సారి వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో అన్నీ అడ్డంకులేనని నాగార్జున అభిమానులు తెగ బాధపడి పోతుంటే, ఫిలిం నగర్ లో 'దిల్' రాజు అంటే గిట్టని ఓ వర్గం మాత్రం ఈ పరిణామాలతో చాలా సంతోషంగా వున్నారట.


Click it and Unblock the Notifications











