'జోష్' టైం
ప్రస్తుతం వున్న సినిమాల్లో మగధీర మినహా మరే సినిమా ప్రేక్షకులని థియేటర్లకి తీసుకురాలేకపోతున్న తరుణంలో, మరో మూడు రోజుల్లో రాబోతున్న 'జోష్' సినిమా పైనే అందరి దృష్టి నిలచింది. ఈ సినిమా తెలుగు సినిమా మార్కెట్ కు 'జోష్'ను ఇస్తుందని అందరూ ఆశిస్తున్నారు.
నాగార్జున తనయుడి తొలి చిత్రం, అపజయమెరుగని 'దిల్' రాజు బ్యానర్ నుండీ ఈ చిత్రం వస్తుండటంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు వున్నాయి. అందుకు తగ్గట్టుగానే 'జోష్'ని భారీ స్థాయిలో విడుదల చెయ్యబోతున్నారు 'దిల్' రాజు. హైదరాబాదులో తొలి రోజుకు ఇప్పటి వరకూ 44 థియేటర్లు సిద్ధమయ్యాయి. మొత్తం మీద 50 థియేటర్లలో విడుదల చెయ్యాలని చూస్తున్నారు 'దిల్'రాజు. ఒక కొత్త హీరో చిత్రం ఇంత భారీగా విడుదలవ్వడం రికార్డు.
ఇక అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా వుంటే ఓపెనింగ్స్ లోనూ ఈ సినిమా రికార్డు నెలకొల్పే అవకాశం వుంది.
josh naga chaitanya karthika dil raju vasu varma magadheera ram charan kajal జోష్ నాగచైతన్య కాజల్ కార్తిక వాసు వర్మ దిల్ రాజు మగధీర రామ్ చరణ్


Click it and Unblock the Notifications