twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కన్నడంలో కేక పెట్టించిన మన కుర్రాడు

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఒక పరిశ్రమ నుంచి హిట్టైన సినిమాలు మరో పరిశ్రమకు వెళ్లటం సహజం. అయితే ఆర్టిస్టులు మాత్రం సాధారణంగా ఒక ప్రాంతానికే పరిమితమవుతూంటారు. హీరోలు అయినా రెండు,మూడు లాంగ్వైజ్ లలో ప్లాన్ చేసుకోవటమో లేక వేరే చోట అవకాసమొస్తే అక్కడకి వెళ్లి నటించటమో చేస్తూంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి ఆఫర్స్ అరుదుగా వస్తాయి. వచ్చినా ప్రూవ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ. తెలుగులో జోష్ రవిగా పేరు తెచ్చుకుని యువ కమిడియన్ గా దూసుకువెళ్తున్న రవికు అలాంటి అవకాసం వచ్చింది.

    Josh Ravi in Kannada Hit Movie KushiKushiyagi‬

    తెలుగులో హిట్టైన గుండెజారి గల్లంతైంది చిత్రం ఖుషి ఖుషియాగి టైటిల్ తో రీమేక్ అయ్యింది. తెలుగు గుండె జారి గల్లంతైంది చిత్రం లో ... గే క్యారెక్టర్....చేసిన జోష్ రవికి ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కన్నడ వెర్షన్ కు సైతం అతన్నే ఆ పాత్రకు తీసుకున్నారు. అక్కడ సైతం రవికి మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారంచ.

    తెలుగులో అదే క్యారెక్టర్ తో మెప్పించిన రవి,కన్నడంలోనూ అదే పాత్రను చేసి కన్నడ ప్రేక్షకులను సైతం ఉర్పూతలూగించాడు. థియోటర్ లో రవి పాత్రకు మంచి రెస్పాన్స్ రావటంతో అక్కడ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రవిని వన్ ఇండియా తెలుగు కలిసి మాట్లాడింది.

    Josh Ravi in Kannada Hit Movie KushiKushiyagi‬

    జోషి రవి మాట్లాడుతూ.... గణేష్ లాంటి పెద్ద హీరోతో తన తొలి చిత్రం చేయటం తన అదృష్టమని చెప్పారు. అలాగే కన్నడ పరిశ్రమలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారని, క్రమశిక్షణతో సాగే పరిశ్రమ అన్నారు. తన పాత్రను రిసీవ్ చేసుకుంటున్న కన్నడ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తూంటే తెలుగు కన్నా పెద్ద హిట్ అవుతున్నదనిపిస్తోందని చెప్పారు. అలాగే కన్నడ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తున్నానని అన్నారు. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో ఇదే చిత్రం రీమేక్ చేస్తున్నానని, అందులోనూ అదే పాత్ర చేస్తుతున్నట్లు తెలిపారు.

    English summary
    Josh Ravi's first Kannada movie KushiKushiyagi‬ with Golden Star Ganesh has got tremendous response at Kannada box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X