జీవిత, రాజశేఖర్ క్రిమినల్ కేసు నమోదు.. అసలు విషయం చెబుతాం.. ఖండించిన స్టార్ దంపతులు
రాజశేఖర్ హీరోగా జీవిత దర్శకత్వం వహించిన శేఖర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా విడుదలయ్యే కొన్ని రోజులలో ఉందనగా ఈ దంపతుల మీద సంచలన ఆరోపణలు చేశారు ఒక సినీ నిర్మాణ సంస్థకు చెందిన వారు. అసలు ఏమైంది హీరో రాజశేఖర్, జీవిత మీద ఎందుకు వారు ఆరోపణలు చేశారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డబ్బులు తీసుకున్నారు అంటూ
ఒకప్పుడు సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న రాజశేఖర్ ఈ మధ్య కాలంలో సరైన సినిమాలు చేయలేదనే చెప్పాలి. వరుస ప్లాపులు అందుకుంటున్న సమయంలో ఆయన గరుడ వేగ అనే సినిమాతో మళ్లీ సక్సెస్ అందుకున్నారు. ఆ సినిమానే ఇప్పుడు ఆయనకు చిక్కులు తెచ్చి పెట్టింది. ఆ సినిమా నిర్మించడం కోసం ఆయన తన దగ్గర డబ్బులు తీసుకున్నారు అంటూ ఒక సంస్థ ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది.

ఆస్తులను తాకట్టు పెట్టుకుని
గరుడవేగ నిర్మాణం సమయంలో వారి ఆస్తులు తాకట్టు పెట్టి తన దగ్గర 26 కోట్లు అప్పు తీసుకున్నారని ఇప్పుడు ఆ నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని జోస్టర్ ఫిలిం సర్వీసెస్ సభ్యులు ఆరోపించారు.
గరుడవేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో రాజశేఖర్ తమ వద్దకు వచ్చి ఎమోషనల్ అయ్యారని, ఆయన తండ్రి వరదరాజు తమకు బాగా పరిచయం ఉండడంతో ఆయన కోరిక మేరకు రాజశేఖర్ ఆస్తులను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చామని అన్నారు.

డేంజరస్ మనస్తత్వం
అయితే ఇప్పుడు ఆ ఆస్తులను బినామీల పేరుతో మార్చుకుని తన మోసం చేశారని జీవిత రాజశేఖర్ కారణంగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామని జోస్టర్ ఫిలిం సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ, జోస్టర్ ఫిలిం సర్వీసెస్ ఫౌండర్ కోటేశ్వరరాజు ఆరోపించారు. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి అని ఆయన పేర్కొన్నారు.

వాడుకున్నారని
ప్రస్తుతం తమిళనాడులో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేశారని, చెక్ బౌన్స్ కేసు కూడా ఆంధ్రప్రదేశ్లోని నగరి కోర్టులో నమోదు అయిందని వారు వెల్లడించారు. ఈ క్రమంలోనే నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వారికి జారీ చేసిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే రాజశేఖర్ జైలుకు వెళతాడు అని వారు చెప్పుకొచ్చారు. అవకాశం కోసం జీవిత, రాజశేఖర్ ఇద్దరూ తమని వాడుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవిత రాజశేఖర్ ఇద్దరూ తమను మోసం చేశారు అని చెప్పడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు వెల్లడించారు.

జీవిత దర్శకురాలిగా
ఇక నటన విషయానికి వస్తే జీవిత ఎప్పుడో నటనకు గుడ్ బై చెప్పగా రాజశేఖర్ మాత్రం ఇంకా హీరోగా కొనసాగుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ అనే సినిమాని తెలుగులో శేఖర్ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించగా జీవిత దర్శకత్వం వహించారు. తొలుత వేరే దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది కానీ తర్వాత అనుకోని పరిస్థితులలో సినిమా నుంచి తప్పుకోవడంతో జీవిత దర్శకురాలిగా మారారు.

జీవిత దర్శకురాలిగా
ఈ విషయం మీద జీవితా రాజశేఖర్ స్పందిస్తూ మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వాటి గురించి ఏప్రిల్ 23న జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తానని అన్నారు. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని మనవి చేస్తున్నానని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











