»   » లేడీ జర్నలిస్టుకు నరకం చూపిన హీరో ఫ్యాన్స్!

లేడీ జర్నలిస్టుకు నరకం చూపిన హీరో ఫ్యాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ హీరో సినిమాపై కామెంట్ చేసిన ఓ లేడీ జర్నలిస్టుకు తమిళ స్టార్ విజయ్ అభిమానులు నరకం చూపారు. విజయ్ నటించిన సినిమా గురించి ఆమె ఓ ట్వీట్ చేయగా.... ఆగ్రహానికి గురైన అభిమానులు వేల సంఖ్యలో స్పందించారు.

ధన్య రాజేంద్రన్‌ అనే జర్నలిస్ట్‌ ఇటీవల షారుక్‌ నటించిన 'జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌' సినిమాకి వెళ్లింది. సినిమా చూశాక ఈ సినిమా గురించి తన అభిప్రాయన్ని వెల్లడించింది. ఈ క్రమంలో విజయ్ నటించిన సినిమా పేరు ప్రస్తావించడంతో ఆమె ఇబ్బందుల్లో పడింది.

ఆ కామెంటే కారణం

ఆ కామెంటే కారణం

షారుక్ సినిమా మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ... ఈ సినిమా విజయ్‌ నటించిన ‘సురా' కంటే చెత్తగా ఉందని ట్వీట్‌ చేసింది. దీంతో విజయ్ అభిమానులు ఆమెను టార్గెట్ చేశారు.

Pelli Choopulu Fame Vijay Devarakonda's Arjun Reddy Movie Trailer Out
నరకం చూపారు

నరకం చూపారు

తమ హీరో సినిమా గురించి కామెంట్ చేయడంతో ఆ జర్నలిస్టుకు నరకం చూపారు.మూడురోజుల పాటు వరుస ట్వీట్లతో ఆమెను ఇబ్బంది పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు 63 వేల ట్వీట్లు చేశారు.

పోలీస్ కంప్లైట్

పోలీస్ కంప్లైట్

వేలాది ట్వీట్లతో తనపై దాడి మొదలవ్వడంతో ధన్య రాజేంద్రన్ పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు ఐటి యాక్ట్, ఇండీసెంట్ రిప్రజంటేషన్
ఆఫ్ ఉమెన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనుమానంతో నలుగురు వ్యక్తులను విచారించినట్లు సమాచారం.

విజయ్

విజయ్

అయితే ఈ సంఘటనపై విజయ్ ఇంకా స్పందించలేదు. ఈ విషయమై ప్రశ్నించేందుకు మీడియా వారు ప్రయత్నించగా ఆయన ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.

English summary
"The police have booked a case under the IT Act and the Indecent Representation of Women Act among others. Bengaluru journalist Dhanya Rajendran would not have imagined that a casual comment on a movie would provoke vicious trolling on social media. There have been around 63,000 tweets over the past three days and a derogatory hashtag trended on Twitter.At one point, the journalist tweeted: "It's clearly organised. A source close to him said: "We are studying if this is a motivated campaign against the actor. Some have also deleted their accounts".Actor Vijay has not responded yet to the controversy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu