twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నందగోపాల్ సన్మాన సభలో దాసరి సెటైర్లు ఎవరిపై?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు నందగోపాల్ రచించిన 'సినిమాగా సినిమా' గ్రంథానికి భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లైక్ మైండెడ్ జర్నలిస్ట్స్ ఫోరం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది.

    ఈ రోజు (ఏప్రిల్ 23) హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్లో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు, సూపర్ స్టార్ కృష్ణ, గిన్నిస్ బుక్ రికార్డ్ మహిళా దర్శకురాలు విజయనిర్మల, ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు టి. ప్రసన్నకుమార్, దర్శకురాలు జయ, బిఏ రాజు తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా దర్శక రత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులపై పరోక్షంగా సెటైర్లు వేసారు. అందుకు సంబంధించిన వివరాలు, ఫోటోలు స్లైడ్ షోలో...

    సన్మానం

    సన్మానం

    21 సంవత్సరాల తర్వాత తెలుగు సినిమా పుస్తకానికి జాతీయ అవార్డు రావడంపై పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేసారు. సూపర్ స్టార్ కృష్ణ నందగోపాల్‌ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. నందగోపాల్ సతీమణి కల్పనా దేవిని విజయనిర్మల సన్మానించారు.

    దాసరి మాట్లాడుతూ...

    దాసరి మాట్లాడుతూ...

    జర్నలిస్టులకు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీస్ ఉన్న దర్శకుడు నందగోపాల్ గారు. తన సిద్దాంతాలకు కట్టుబడి ఉండే అతి కొద్ది మంది వ్యక్తులలో ఆయన ఒకరు. ఆయన రాసిన పుస్తకం భవిష్యత్ తరాలకు అవసరమైన పుస్తకం అన్నారు.

    ఇండస్ట్రీకి, వ్యక్తులకు మధ్య సంబంధం ఏది?

    ఇండస్ట్రీకి, వ్యక్తులకు మధ్య సంబంధం ఏది?

    దాసరి మాట్లాడుతూ....భానుమతి గారి ‘నాలో నేను' పుస్తకానకి జాతీయ అవార్డు వచ్చినపుడు తెలుగు సినిమా పరిశ్రమ అంతా ఆమెకు సన్మానం చేసారు. కనీ ఇవాళ పరిస్థితి అలా లేదు. ఇవాళ ఇండస్ట్రీ, వ్యక్తుల మధ్య సంబంధం లేకుండా పోయింది అన్నారు.

    పాఠ్య గ్రంథంగా...

    పాఠ్య గ్రంథంగా...

    నందగోపాల్ ఈ పుస్తకాన్ని రాయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది. ఒక మంచి పుస్తకం రాయాలనే తపనతో ఆయన అనేక సార్లు చాప్టర్స్‌ను మార్చి రాసారు. ఎన్టీఆర్ యూనివర్శిటీ వారు ఈ పుస్తకాన్ని ఒక పాఠ్యగ్రంథంగా చేసుకుంటామని చెప్పారు.

    నందగోపాల్ స్పందిస్తూ...

    నందగోపాల్ స్పందిస్తూ...

    నందగోపాల్ స్పందనను ఆయన కుమారుడు తెలియజేస్తూ....చాలా కాలం తర్వాత ఉత్తమ సినిమా గ్రంథంగా నా పుస్తకానికి అవార్డు రావడం ఆనందంగా ఉంది. 1993 సంవత్సరం తర్వాత అంటే దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు అందుకున్న మొదటి జర్నలిస్టును నేను. నేను ఈ పుస్తకం రాయడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.

    English summary
    Senior Journalist Nandagopal has bagged prestigious National Award for his book named ‘Cinemaga Cinema’ in recent and we all know that. Like Minded Journalist Forum has felicitated him at Film Chamber, Hyderabad today, for his success in attaining such merit.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X