శ్రీకాంత్, మేఘన జంటగా సినిమా షురూ..
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా, వివి వినాయక్ కెమెరా స్విచాన్ చేసారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభు మంచి విమర్శకుడు కాబట్టి సినిమా ఎలా తీస్తే ప్రేక్షకులను నచ్చుతుందో అలా తీస్తాడనే నమ్మకం ఉంది, ఈ సినిమా మంచి యాక్షన్ ఎంటర్టెనర్‌గా పేరు తెచ్చుకుంటుంది అన్నారు.
దర్శకుడు ప్రభు మాట్లాడుతూ.. 'యాక్షన్ నేపధ్యంలో సాగే భినమైన కధాంశంతో కూడిన చిత్రం, శివరంజని మేగజైన్లో పని చేస్తున్నప్పటి నుంచి పరిశ్రమలో ఉన్నాను, దర్శకుడిని కావాలనే కోరిక ఇప్పటికి తీరిందన్నారు. ఇతర పాత్రలలో పోసాని క్రిష్ణ మురలి, చిత్రం శ్రీను, రవివర్మ, కారుమంచి రఘు, డా.రవిప్రకాష్ లు నటిస్తున్నారు. కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: సాయికార్తీక్, ఎడిటింగ్: నాగిరెడ్డి, సమర్పణ: జ్యోత్స్నారెడ్డి, నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి, స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు.


Click it and Unblock the Notifications












